మేషం(Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగపరంగా కొంత ప్రయోజనం జరుగుతుంది. అర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇంటా బయటా బాగా శ్రమ పెరుగుతుంది. సమస్యల పరిష్కారానికి విపరీతంగా ఆలోచించి మనశాంతితి పోగొట్టుకోవద్దు. అందరినీ కలుపుకుని వెడితే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరికీ హామీలు ఉండొద్దు. (ప్రతీకాత్మకచిత్రం)
వృషభం(Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఆదాయ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచిఆశించిన సహకారం లభిస్తుంది.(ప్రతీకాత్మకచిత్రం)
మిథునం(Gemini):(మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) కొత్త ఉద్యోగావకాశాలు మీ ముందుకు వస్తాయి. పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఇంటా బయటా గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఆరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మకచిత్రం)
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు 4,పుష్యమి, ఆశ్లేష) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.(ప్రతీకాత్మకచిత్రం)
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో కొన్ని ఊహించని ఇబ్బందులు అనుభవానికి వస్తాయి. బకాయిలు వసూలవుతాయి. ఆరో గ్యం నిలకడగా ఉంటుంది. కొన్ని అవాంతరాలున్నా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. దగ్గరి బంధు వులతో విభేదాలకు అవకాశం ఉంది. వ్యాపారంలో శక్తికి మించి శ్రమ పడి మంచి ఫలితాలు పొందు తారు. హామీలు ఉండవద్దు.(ప్రతీకాత్మకచిత్రం)
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆదాయపరంగా సమయం బాగుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధి కారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలకు ఆస్కారముంది. కొన్ని అర్థిక సమ స్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో అనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయపడ తారు. అరోగ్యం బాగుంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) విభేదాలు, వివాదాల కారణంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలి స్తాయి. సరైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికి వచ్చే పనులు చేపడతారు. ఆరోగ్యం పట్ట జాగ్రత్త.(ప్రతీకాత్మకచిత్రం)
వృశ్చికం (Scorpio): (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చాలాకాలంగా ఇబ్బంది పడుతున్న కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్త వింటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.(ప్రతీకాత్మకచిత్రం)
ధనుస్సు (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) బంధుమిత్రుల వల్ల కొద్దిగా ఇబ్బంది పెడతారు. ఉద్యోగంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి . ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పదు. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తి ప్పట ఎక్కువగా ఉంటుంది.(ప్రతీకాత్మకచిత్రం)
మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఉద్యోగపరంగా సమయం అనుకూలంగా ఉంది. తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అర్థిక లావాదేవీలకు, ఊహాగానాలకు ఇది సమయం కాదు. కుటు౦బంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వాహన యోగాల మీద దృష్టి పెడతారు. విద్యార్భులకు కొద్దిగా పరవాలేదు.(ప్రతీకాత్మకచిత్రం)
కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) కొత్త ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొద్దిగా ధనలాభం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. మిత్రు లు, అప్పుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఇరుగు పారుగువారితో వివాదాలకు దిగవద్దు. అరోగ్య౦ బాగానే ఉంటుంది.(ప్రతీకాత్మకచిత్రం)
మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ప్రతిదీ ఆ లోచించి చేయండి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్య లు ఎదురవుతాయి. సహోద్యోగులు సహకరిస్తారు. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మకచిత్రం)