సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు.
శనిదేవుడిని ఆరాధించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతి శనివారం ఆలయాలలో శనిదేవుడిని పూజించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇళ్లలో మాత్రం శని విగ్రహం ఉండదు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం.. శనిదేవుడు ఎవరినైనా చూసిన వారు చెడు స్థితిలో ఉంటారని శాపం ఉంది.. శని దృష్టిని నివారించడానికి అతని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించకపోవడానికి కారణం ఇదే.