అందరూ మంచివారే అని నమ్మే వీరి మంచితనాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకుని సులభంగా మోసం (Fool) చేస్తారు. మోసపోయామని తెలుసుకున్న తర్వాత వీరు చాలా కృంగిపోతారు. జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, ముఖ్యంగా నాలుగు రాశుల వారు స్వచ్ఛమైన మనసుతో అందరినీ నమ్ముతూ బాగా మోసపోతుంటారు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారు మైండ్ గేమ్‌లు ఆడలేరు. అలాగే ఇతరులు ఆడే మైండ్ గేమ్స్ ను కూడా కనిపెట్టలేరు. ఈ కారణం వల్ల ప్రజలు వీరిని సులభంగా మోసం చేయగలుగుతారు. వాస్తవానికి మోసపోవడం వారికి అలవాటు అయిపోతుంది. నిజానికి, వృశ్చికరాశి వారు సాధారణంగా ఇతరులను నమ్మరు. కానీ వీరు తాము నమ్మిన వ్యక్తుల చేతిలో ఈజీగా మోసపోతారు. వీరు నమ్మిన వ్యక్తులు వీరిని పిచ్చోళ్లను చేసి ఒక ఆట ఆడిస్తారు. నమ్మిన వ్యక్తులే ఇలా చేశారని గ్రహించి వారిలో ట్రస్ట్ సమస్యలు కూడా తలెత్తుతాయి. స్నేహితులు, తెలిసినవారు వీరికి అంతగా వాల్యూ కూడా ఇవ్వరు.
కుంభరాశి.. కుంభరాశి రాశివారు సులభంగా మోసపోతారు. ఇతరులు చెప్పిన మాటలు నమ్మేసి వీరు మోసపూరిత మార్గంలో నడిచేందుకు కూడా సిద్ధమవుతారు. పుకార్లను వీరు ఇట్టే నమ్మేస్తారు. అది నిజమా, అబద్దమా అనేది చెక్ చేయడానికి కూడా వారు ఆసక్తి చూపరు. ఎలాంటి ప్రశ్నలు వేసుకోకుండా విన్న ప్రతి మాటని వీరు గుడ్డిగా నమ్ముతారు. అందుకే మోసగాళ్లకు కుంభరాశి వ్యక్తులను మోసగించడం పెద్ద కష్టమైన పని కాదు.
ధనుస్సురాశి.. అనుబంధాలకు ధనుస్సురాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరికి బంధుమిత్రులు అంతగా విలువ ఇవ్వరు. స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా తేలికగా వీరిని ఫూల్స్ లేదా పిచ్చివాళ్లని చేస్తారు. వీరు ఇతరుల మోసపూరితమైన మనసును గ్రహించలేరు. మోసం చేసే వారికి అనేక అవకాశాలను ఇచ్చి పదేపదే మోసపోతారు. ఈ కారణం వల్ల వారు పదేపదే తాము మోసపోయినట్లు ఫీల్ అవుతూ జీవితాన్ని గడుపుతుంటారు.
కర్కాటకరాశి .. కర్కాటక రాశి వారి తమ స్నేహితులు లేదా శత్రువుల చేతిలో సులభంగా మోసపోతారు. ఈ సున్నితమైన వ్యక్తులను మోసగించడం చాలా సులభం. అలాగని వీరేం తెలివితక్కువవారు కాదు. ఈ రాశి వారు చాలా తెలివైన వారే అయినప్పటికీ... ఇతరులు చాలా మంచివారు అనుకునే గొప్ప మనస్తత్వం వీరిలో ఉంటుంది. ఈ ప్రపంచంలో చెడ్డ వ్యక్తులే లేరన్నట్లుగా వీరు ఎల్లప్పుడూ భావిస్తారు. ఈ కారణంగానే సులభంగా మోసపోతారు.