Surya Gochar 2023: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం తన నిర్ణీత సమయంలో సంచరిస్తుంది. గ్రహం సంచరించినప్పుడల్లా మొత్తం 12 రాశుల జీవితాలపైనా ప్రభావం ఉంటుంది. అయితే కొన్ని రాశులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మరికొన్ని రాశులకు చెడు చేస్తుంది. ఇప్పుడు సూర్యుడి సంచారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా..?
సాధారణంగా సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యుడు సంచరించినప్పుడు అన్ని రాశుల వ్యక్తుల జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరి జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటాడో.. వారు జీవితంలో ప్రతి దానిలో విజయం సాధిస్తారు. అయితే వచ్చేనెల.. అంటే ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే..?
సూర్యభగవానుడు మేష రాశిలో ఉన్నపుడు చాలా బలవంతంగా ఉండడంతో పాటు.. శుభాలు అందిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ రాశిలో సూర్యుడి సంచారంతో అనేక రాశులకు చెందిన వారి జీవితాలలో సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఊహించని విధంగా ధన లాభం కలిగిస్తుందని.. అనూహ్యంగా ఆదాయం పెరుగుతోంది అంటున్నారు. మరి ఆ రాశులు ఏంటో తెలుసా?
మేష రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి మొదటి ఇంటిలో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా సూర్యుడి ప్రతిష్ట మరింత రెట్టింపు అవుతుంది అంటున్నారు. దీని కారణంగా ఆ రాశి ప్రజలకు ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. మేష రాశి వ్యక్తులు పూర్తి విశ్వాసంతో, శక్తితో పని చేయగలుగుతారు. పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగం, కార్యాలయంలో మంచి ప్రశంసలు దక్కుతాయి. అత్తమామల వైపు నుంచి ఆస్తి కలిసి రావొచ్చు అంటున్నారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశికి చెందిన వారికి సూర్యుడు మంచి స్థితిలో ఉన్నాడు. సూర్యుడు ఈ రాశిచక్రంలోని పదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారికి వృత్తిని పెంచుతుంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటలో మంచి లాభాలు వస్తాయి అంటున్నారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులు ఇదే మంచి అవకాశం. ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ కు అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అద్భుత లాభం ఉంటుంది అంటున్నారు.