Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం తన రాశి మారుస్తూ ఉంటుంది. అలా రాశి మార్చినప్పుడు ప్రతిసారి.. కొన్ని రాశులపై వాటి ప్రభావం ఉంటుంది. కొన్నిరాశులకు లాభాల్ని అందిస్తే, మరికొన్ని రాశులకు ఇబ్బందుల్ని కలగచేస్తాయి. తాజాగా మీన రాశిలో బుధ, గురు, సూర్య గ్రహాల యుతి కారణంగా. ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే..?
వృషభ రాశి
బుధ, సూర్య, గురు, చంద్ర గ్రహాల యుతితో వృషభ రాశి జీవితంలో అత్యంత శుభ ఫలాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈ రాశి వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఊహించనివిధంగా మెరుగు పడుతుంది. సమాజంలో వీరికి ఆకర్షణ పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు లభిస్తాయి.
మిథున రాశి
మిథున రాశి జీవితంలో రాజయోగం కారణంగా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి దక్కే అవకాశం ఉంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. అధికారం, ప్రభుత్వ సంబంధిత పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.
కన్యా రాశి
వందేళ్ల తరువాత ఏర్పడిన ఈ మహా సంయోగంతో కన్యా రాశి జీవితంలో పెను మార్పులను తీసుకొస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అన్ని వైపుల్నించి విజయం ప్రాప్తిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. పెద్ద డీల్ చేయడం ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో విజయం ఉంటుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం రెండూ బాగుంటాయి.