మన సమాజంలో వివిధ రకాల ఆలోచనలు, వ్యక్తిత్వాలు ఉన్నవారు ఉంటారు. అయితే అందరూ ప్రాక్టికల్‌గా, స్థిరంగా ఉండలేరు. మనస్తత్వాన్ని బట్టి భిన్నంగా, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు ప్రతి విషయంలో నటిస్తుంటారు. ఇంకొందరు చిన్నపిల్లల మాదిరిగా ప్రతిదానికీ ఏడుస్తుంటారు. ఇలా ఏడ్చే స్వభావం ఉన్న రాశుల గురించి తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య.. ఈ రాశివారు తమకు తెలిసిన ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధంగా విమర్శిస్తూనే ఉంటారు. ప్రతిదానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లేకపోతే పిల్లల వలె కోపంతో ఏడ్చే స్వభావం కలవారు. ప్రేమించే వ్యక్తిని బాగా ఇష్టపడతారు. అయితే వారిని తక్కువ చేసి మాట్లాడే భయంకరమైన అలవాటు కలిగి ఉంటారు. దీంతో వీరితో కలిసి ఉండేవారికి కన్నీళ్లు తప్పవు.
మిధునం.. ఈ రాశివారు వారు చేసిన తప్పులను, ద్వంద్వ వైఖరిని అసలు ఒప్పుకోరు. ఈ రకమైన వ్యవహారశైలి కారణంగా ఎవరికీ సాయం చేయరు. నటనలో రెండు ఆకులు ఎక్కువే చదివారు. వారిపై వారు జాలి చూపించడం కోసం ఏడుస్తున్నట్లు తెగ డ్రామా చేస్తుంటారు. ఇతరుల దృష్టిని ఆకర్షించడం ఈ రాశివారి లక్షణం. అందుకే ప్రతిదానికి నటిస్తుంటారు.
మీనం .. ఈ రాశివారు చాలా అమాయకంగా, ఎవరితో కలవకుండా దూరంగా ఉండేటట్లు పైకి కనిపిస్తారు. నిజానికి వీరు ఒంటరితనాన్ని ద్వేషిస్తారు. ఏదైనా ప్లాన్ నుండి తప్పుకున్నట్లయితే వీరు తక్షణమే ప్రతిస్పందించరు. కానీ తర్వాత ఏడుస్తూ కుర్చుండటాన్ని చూడవచ్చు. వారు అనుకున్నది సాధించడం కోసం ఇలా ప్రవర్తిస్తుంటారు. వారిని అలా ఒంటరిగా వదిలేయడమే మంచిది.
అలాంటి వ్యక్తిత్వం ఉన్న రాశుల్లో ప్రధానంగా కర్కాటక రాశివారు ముందు వరుసలో ఉంటారు. కర్కాటక రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ వారి కోపాన్ని, భావోద్వేగాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ సాధ్యం కాదు. అందుకే ఫిర్యాదు చేయడానికి అవసరమైన విషయాలను వెతుక్కోవడం, వ్యక్తులలో లోపాలు వెదికే పనిలో వారు తమ ఎమోషన్స్‌ను బయటకు నెట్టెస్తారు.