మీనం .. మీ బెస్ట్ ఫ్రెండ్ ఈ రాశివారు అయితే తమ ఉద్దేశాలను మీకు నిజంగా వెల్లడించకపోవచ్చు. అయితే వారు సాధించాల్సిన లక్ష్యాలను ఈజీగా తెలుసుకోవచ్చు. స్నేహం, శృంగారం విషయంలో తమ భాగస్వామిని డైనమిక్‌గా నియంత్రించడానికి ఇష్టపడతారు. దీంతో వీరు తరచుగా నిజమైన స్నేహితుల కంటే నమ్మకమైన సైడ్‌కిక్‌లను కలిగి ఉంటారు.
కన్య .. ఏదైనా అత్యవరసమైనప్పుడు కన్యా రాశివారు తమ స్నేహితులను బాగా ఇబ్బందిపెడతారు. వీరు ఇతరుల నుంచి సహాయాన్ని తరుచు ఆశిస్తుంటారు. కన్యా రాశివారు తమను తాము నైతికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని భావిస్తారు. అవసరాల కోసం స్నేహితులను వినియోగించుకుంటారు. వారు తమ స్నేహితులను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. సామాజికంగా ఆమోదయోగ్యమైన ఎంపికలు లేదా ప్రవర్తనను చేయడానికి వారిని ప్రోత్సహిస్తారు.
మరికొందరు తమ స్నేహితులను తరుచూ ధ్వేషిస్తుంటారు. మేష రాశి వారు స్నేహితుల పట్ల కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. స్నేహితులు కెరీర్‌కు సంబంధించి ఏమైనా పొరపాట్లు చేస్తే దూషిస్తుంటారు. అయితే, స్నేహితులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వారు ఇలా చేస్తుంటారు. స్నేహితుల జీవితంలో తప్పు జరుగుతుందని భావిస్తే.. నిర్మొహమాటంగా చెబుతారు. అయితే, ఇలా చెప్పడం ద్వారా స్నేహితులు నొచ్చుకునే ప్రమాదం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)