THESE ARE THE LUCKY COLOURS OF TWELVE ZODIAC SIGNS RNK
Colors For Zodiac Sign: ఈ రాశివారు ఎరుపు రంగు అస్సలు వాడకూడదు!
జోతిష శాస్త్రం ప్రకారం మన రాశులు మన వ్యక్తిత్వాన్ని చెబుతాయి. ఇది మన స్వభావం, బాధ్యత ఆలోచనలను వెల్లడిస్తాయి. ఒక్కో రాశివారికి ఒక్కో రంగు అచ్చు వస్తుంది.అందుకే మీ వ్యక్తిత్వానికి తగిన రంగులను ఎంచుకోవాలి. కాబట్టి ఏ రంగువారికి ఏ రంగు కలిసి వస్తుందో తెలుసుకుందాం.
మేషరాశి అగ్నిలాంటిది. ఎరుపు, ఊదా, పసుపు, మెరూన్ రంగులు ధరించడం మంచివి. అదేవిధంగా వారు నలుపు, తెలుపు, గులాబీ రంగులకు దూరంగా ఉండాలి.
2/ 12
ఈ రాశివారు స్థిరమైన, వాస్తవిక దృష్టి, ధైర్యానికి ప్రతీక. అందుకే వృషభ రాశివారు నలుపు, ఆకుపచ్చ, పింక్ కలిసివచ్చే రంగులు. ఊదా రంగు వాడకూడదని జోతిషులు చెబుతున్నారు.
3/ 12
మిధున రాశి దేన్ని విశ్లేషించదు. ఇది తెలివిగల రాశి అందుకే ఈ రాశివారు పసుపు, లేత ఆకుపచ్చ, తెలుపు, గులాబీ రంగులను ఉపయోగించాలి.అలాగే ఎరుపు, నారింజ రంగులకు దూరంగా ఉండాలి.
4/ 12
ఈ రాశివారు సున్నిత మనస్తత్వం కలవారు. వీరు భావోద్వేగం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఇతరుల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు కాబట్టి.. ఆకుపచ్చ, నీలం, తెలుపు, పసుపు రంగులు అనుకూలమైనవి. ముదురు, లేత ఊదా రంగు(బర్గండి) వాడకపోవడం ఉత్తమం.
5/ 12
సింహ రాశివారు సృజనాత్మకతతో.. తేజస్సు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశివారు గోధుమ, ఊదా,గోల్డ్, నారింజ రంగు ధరించడం ఉత్తమం. అదేవిధంగా లేత గులాబీ, లేత నీలం, తెలుపు రంగులను ఉపయోగించకూడదు
6/ 12
కన్యా రాశివారు ఆచరణాత్మకంగా ఆలోచిస్తుంది. వీరికి అనేక నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆకుపచ్చ, నలుపు, బూడిద, పీచు రంగులను ఉపయోగించడం ఉత్తమం. అలాగే, ఎరుపు, నారింజ రంగులకు దూరంగా ఉండాలి.
7/ 12
తులారాశి వారు జీవితంలో ప్రతీది సమతూల్యం చేస్తారు. క్రీం, నీలం, నలుపు, పింక్ ఉపయోగిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా బ్రైట్ నియాన్ రంగులకు దూరంగా ఉండండి.
8/ 12
ఈ రాశివారు ఇతరులను ప్రభావితం చేస్తాయి. లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. కాబట్టి వారి మెరూన్, పర్పుల్, దానిమ్మ రంగు,నలుపు రంగు ఉపయోగించవచ్చు. అలాగే తెలుపు, గులాబీ రంగు దుస్తులు వాడకూడదు.
9/ 12
ఈ రాశివారు నిరంతరం మారుతూ ఉంటారు. మిశ్రమ రంగు ఉన్న కలర్స్‌ను ధరించాలి. ధనస్సు రాశివారు నలుపు, గులాబీ రంగు దుస్తులకు దూరంగా ఉండాలి.
10/ 12
మకర రాశివారు ఎక్కువ సాధించేవారు కాబట్టి, నలుపు, బూడిద, ముదురు నీలం, తెలుపు రంగు దుస్తులను ఉపయోగిస్తే ఉత్తమమైన ఎంపిక. అదేవిధంగా పసుపు, ఊదా, నియాన్ రంగులకు దూరంగా ఉండాలి.
11/ 12
కుంభ రాశివారికి గొప్ప జ్ఞానం, స్నేహపూర్వక స్వభావం కలిగినవారు. ఈ రాశివారు వెండి, నీలవర్ణం, లైలక్ ధరించవచ్చు. అలాగే ఆరెంజ్, గోల్డ్, బ్లూ వాడకపోవడం మంచిది.
12/ 12
మంచి భావాలు కలిగినవారు మీనరాశి వారు దయ, హృదయపూర్వక మనస్తత్వం కలిగివారు. లావెండర్, తెలుపు, నీలం, పీచు రంగులు అనుకూలం. అదేవిధంగా ఎరుపు, ముదురు,నీలం వాడకపోవడం మంచిది.