ఒకరి పట్ల ఆకర్షితులు కావడం అనేది చేదుతీపిలాగా ఉంటుంది. ఎందుకంటే అతన్ని చాలా ఇష్టపడతారని అవతలి వ్యక్తి గ్రహించలేకపోవచ్చు. దీంతో గందరగోళంలా ఉంటుంది. అందుకే మీ భావాలను ముందుగా వ్యక్తీకరించడం ఉత్తమ మార్గం. అందుకు ఎంతో ధైర్యం కావాలి. ఇక్కడ ఒకరినొకరు రహస్యంగా ఇష్టపడే స్వభావం ఉన్న రాశిచక్రాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం - ధనస్సు.. ఈ జంట అంత చూడముచ్చటగా ఉండదు. ఎందుకంటే మీన రాశివారు చాలా సున్నితంగా ఉంటే.. ధనస్సు వారు స్వేచ్ఛ, ప్రయాణాలు, సాహసం వంటి అడ్వెంచర్లపై దృష్టిసారిస్తుంటారు. ఈ ఇద్దరికీ ఉమ్మడిగా ఉండే విషయం ఏమిటంటే వారి సన్నిహితులపై ప్రేమ. వారిద్దరూ చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమకు ఎంతో విలువనిస్తారు. ఈ ఇద్దరూ ఒకరి సృజనాత్మకతను మరొకరు బాగా మెచ్చుకుంటారు.
మిధునం - కర్కాటకం .. ఈ జంట ఊహించనటువంటిది. మిధునం - కర్కాటకరాశి వారు గొప్ప జంటగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వారిద్దరూ స్నేహానికి, ప్రేమకు సరికొత్త స్థాయిలో విలువ ఇస్తారు. కర్కాటక రాశివారు మిధునరాశికి ఓపికగా, స్థిరంగా ఉండాలని సూచిస్తారు. కర్కాటకరాశి వారికి సామాజికంగా, బయటికి వెళ్లాలని బోధిస్తుంటారు మిధునరాశివారు. వారిద్దరూ ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తారు. రహస్యంగా ఆరాధిస్తారు.
మేషం- కుంభం..
ఈ రెండు రాశులు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. మేషరాశి వారు భయంకరమైన తిరుగుబాటు చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే కుంభరాశులు వారి అంతర్ముఖ మూలలో తిరోగమిస్తారు. కానీ వారిద్దరూ కష్టాలతో నిండిన ప్రాపంచిక జీవితాన్ని ఎంచుకోవడం కంటే రిస్క్ తీసుకోవడాన్ని ఇష్టపడతారు. పనిచేసే సంస్థలో వీరు బాగా వృద్ధిలోకి వస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, ఒక వ్యక్తికి దగ్గరవ్వడానికి, మీరు అతనిని బాగా తెలుసుకోవాలి అనే అంశం ప్రేమ అనుకూలతతో ఉండే మొదటి కష్టం. రెండవ కష్టం భవిష్యత్తు. మీకు విభిన్న లక్ష్యాలు, సమస్యలను పరిష్కరించే మార్గాలు ఉంటే, మీరు కలిసి జీవించడం అంత దగ్గరలో ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది రహస్యంగా అలానే ప్రేమిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)