‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ మనలో చాలా మందికి ఇది అనుభవమయ్యే ఉంటుంది. అంటే, ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని తొలి చూపులోనే ప్రేమించడం. ఇది ప్రతి ఒక్కరికి విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని భావోద్వేగాలకు లోనయ్యేలా చేస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.(ప్రతీకాత్మక చిత్రం)
మీన రాశి
మీనరాశి వారిని రొమాంటిక్స్ అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరు ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని, మంచిని మాత్రమే చూస్తారు. వారి స్వభావాన్ని అర్థం చేసుకున్న ఎవరితోనైనా క్షణాల్లో ప్రేమలో పడతారు. వాస్తవానికి, మీన రాశి వారు మొదటి చూపులోనే ప్రేమలో పడటం చాలా సులభం. ఎందుకంటే, వీరు ఎప్పుడూ ప్రేమ మైకంలోనే ఉంటారు. వీరికి ప్రేమ అనేది ఇక అనుభవం కాదు మాత్రమే కాదు జీవితం.(ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు అద్భుతమైన ఒప్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆశ్చర్యకరంగా, వారు ప్రేమలో పడటానికి తమను తాము ఒప్పించుకుంటారు. కర్కాటక తరచుగా వారి స్వభావానికి దగ్గరైన వ్యక్తుల వైపు ఆకర్షితులవుతారు. వీరు, తరచూ ప్రేమ ఆలోచనల్లో విహరిస్తుంటారు. కాబట్టి, వీరి ఆలోచనతో సరిపోలిన వారు ఎవరు కనిపించినా సరే భావోద్వేగానికి గురవుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి.. సింహ రాశి అత్యంత ఆధిపత్య రాశిచక్ర గుర్తుల్లో ఒకటి. ఈ రాశి వారికి ప్రతిదానిపై అంతులేని అభిరుచి ఉంటుంది. వారి భయంకరమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన స్వభావం మొదటి చూపులోనే ప్రేమలో పడేలా చేస్తుంది. అంతేకాదు, వీరు ప్రేమించిన వ్యక్తులను అన్ని అడ్డంకులను దాటుకొని వివాహం చేసుకుంటారు. ఈ రాశి వారికి దూకుడు స్వభావం ఎక్కువ. అందుకే, ప్రేమలో పడే ముందు అస్సలు ఆలోచించరు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారు ఉద్వేగభరితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు అస్సలు సమయాన్ని వృథా చేయరు. వీరు మనస్సులో అనిపించిన దాన్ని తక్షణమే అమలు చేస్తారు. ప్రేమ విషయంలో కూడా ఇలాంటి వైఖరే అవలంభిస్తారు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత తమ ప్రేమను సాధించుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)