మిథునం.. ఈ రాశివారు ఎప్పుడూ సరదాగా, ఉత్సాహంగా ఉండాలని భావిస్తారు. అదిలేని జీవితాన్ని ఊహించడానికే ఇష్టపడరు. దీన్ని బట్టి వీరు పెళ్లిపై వ్యతిరేక భావనతో ఉంటారు అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం ఆ బంధానికి కట్టుబడి ఉండడం అనే ఆలోచన వీరికి పీడకలగా అనిపిస్తుంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే తమ సామాజిక జీవితానికి అది అడ్డంకిగా మారుతుందని దీంతో వివాహం చేసుకోవడానికి భయపడతారు.
కుంభం.. ఈ రాశివారు ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటారు. బంధాలకు కట్టుబడి ఉండటం వీరికి అసలు ఇష్టం ఉండదు. జీవితాంతం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వారితో కలిసి జీవించడం కుంభ రాశివారికి కష్టమైన పని. పెళ్లి అంటేనే వీరికి అసలు పడదు. అసలు ముక్కు మొహం తెలియని వారితో పెళ్లిని అసలు ఇష్టపడరు. (ప్రతీకాత్మక చిత్రం)