ఈ టెంపుల్ చూడండి. ఇది పురాతన ఆలయం. ఉత్తరప్రదేశ్... మీరట్‌లోని నవచండీ దేవి ఆలయం ఇది. ఇందులో... వందల ఏళ్ల నాటి బ్రిటిషర్ల కత్తి ఒకటి ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఆ కత్తికి కూడా పూజలు చేస్తారు. కత్తిని కళ్లకు అద్దుకుంటారు. దసరా నాడు ఈ కత్తికి ఆయుధ పూజతోపాటూ.... మరిన్ని ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.