ధనుస్సు రాశి వారి వ్యవహారశైలి విభిన్నంగా ఉంటుంది. దేన్నేనా వీరు ఎదుర్కోగలరు. వారికి ఎదురు ప్రశ్నలు వేయడం కన్నా వారికి అనుగుణంగా నడుచుకోవడం ఉత్తమం. ధనుస్సు రాశి వారికి ఏదైనా పని ఇస్తే , వారికి నచ్చిన సమయంలో పూర్తి చేస్తారు. వారితో భాగస్వామ్యం పనికిరాదు. వారు ఒంటరిగాఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు.(ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు రాశి వారు ఒంటరిగానే అన్ని పనులు చేసుకుంటారు. ఎంత పెద్ద సమస్య అయినా వారే పరిష్కరించుకుంటారు. ఎవరి సాయం అడగరు. అది వారి ప్రైవేటు జీవితం అయినా, వృత్తి జీవితానికి సంబంధించిన సమస్య అయినా వారే పరిష్కరించుకుంటారు. ఇదే విషయాన్ని వారి ముందు ఎవరైనా ప్రస్తావిస్తే వారి నుంచి కఠిన సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)