మేషం: మేష రాశి వారికి మార్చి 31 నుంచి మంచి కాలం ప్రారంభం అవుతుంది. మేషరాశిలో 11వ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. ఇది లాభం, ఆదాయ రేటును సూచిస్తుంది. అందువల్ల మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉండవచ్చు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. అలాగే శుక్రుడు మీనరాశిలోని రెండు, ఏడవ గృహాలకు అధిపతి. అందువల్ల మీ భాగస్వామ్య నుంచి ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారంలో జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం: శుక్రుని సంచారం వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు మీ పదవ గృహంలో సంచరిస్తాడు. దీనిని ఉద్యోగం, వృత్తి స్థానంగా భావిస్తారు. అందువల్ల మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్ రావచ్చు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందవచ్చు.రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారికి మంచి పదవి దక్కే సూచనలున్నాయి. వృషభ రాశిని శుక్రుడు స్వయంగా పాలిస్తాడు. అందువల్ల ఈ సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం: శుక్రుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. శుక్ర గ్రహం మీ రెండవ గృహంలో సంచరిస్తుంది. ఇది డబ్బుకి సంబంధించినది. ఈ సమయంలో వ్యాపారంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే..అది మీ చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్, ప్రమోషన్ వస్తాయి. మకరరాశిని శని దేవుడు పరిపాలిస్తారు. శని దేవుడు, శుక్ర దేవుడి మధ్య స్నేహ భావం ఉండడం వల్ల.. శుక్రుడి సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)