మిథునం (Gemini): శనిదేవుడు రాశి మారడంతో మిథున రాశి వారికి శని ధైయా నుంచి విముక్తి లభిస్తుంది. శని ధైయా ముగిసిన వెంటనే ఈ రాశి వారికి కష్టాలు తగ్గుతాయి. సమస్యలు తగ్గుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ధనలాభం పొందే పరిస్థితి ఉంటుంది. చేతికి డబ్బు అందుతుంది. ఆర్థిక కష్టాలు ఉండవు. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): ప్రస్తుతం తులారాశి వారికి శని ధైయా కొనసాగుతోంది. శనిగ్రహం మారడం వల్ల ఈ రాశి వారికి శని ధైయా నుంచి విముక్తి లభిస్తుంది. ధైయా ముగిసిన వెంటనే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. శని రాశి మార్పు వీరికి డబ్బు పరంగా లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. పలు రంగాలలో విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (sagittarius): 29 ఏప్రిల్ 2022 న శని సంచారంతో మీరు శని ధైయా నుంచి విముక్తి పొందుతారు. ఈ సమయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో వచ్చే అడ్డంకుల నుండి విముక్తి పొందుతారు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)