వృషభం: వీరికి మనశ్శాంతి ఉండదు. అందుకే కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగంలో మార్పు రావచ్చు. ధన నష్టం కలగటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. జీవన పరిస్థితులు బాధాకరంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపండి.. లేదంటే కాపురంలో సమస్యలు వస్తాయి. బయటి వ్యక్తులను ఎవరినీ నమ్మవద్దు. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం: బుధుడి అస్తమయం కారణంగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అనవసరమైన కోపం మానుకోండి. కోపం వల్ల మీకు నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఉద్యోగంలో బయటి వ్యక్తులను నమ్మవద్దు. ఆఫీసులో పనిభారం పెరగవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు చేయవద్దు. పెట్టుబడి పెడితే నష్టాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. (ప్రతీకాత్మక చిత్రం)
తుల: ఈ రాశుల వారి మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే అనారోగ్యం వేధిస్తుంది. లావాదేవీలకు ఇది మంచి సమయం కాదు. ధన నష్టం కలగవచ్చు. ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. అనవసర వాదనలు, కొట్లాటలకు దూరంగా ఉంటే మంచిది.(ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం: వీరి మనసులో అసంతృప్తి, నిరాశ భావనలు ఉంటాయి. బుధ అస్తమయం కారణంగా అనారోగ్య సమస్యలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఆఫీసులో ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అందుకే ఓపికగా ఉంటే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)