వృషభ రాశి (Taurus): కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశంఉంది. వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. గృహ, వాహన యోగాలున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది.
మిథున రాశి (Gemini): సమయం కొద్దిగా ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించినా పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఖర్చులకు కళ్లెం వేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
సింహ రాశి (Leo): గ్రహ సంచారం కొద్దిగా ప్రతికూలంగా ఉన్నందువల్ల ప్రతి పనికీ శ్రమ, మానసిక ఒత్తిడి తప్పవు. ఉద్యోగంలో మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారం నిలకడగా ఉంటుంది. మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సమస్య పరిష్కారంలో అవరోధాలు తొలగుతాయి. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.
తుల రాశి (Libra): వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు అంది వస్తాయి. అన్ని విధాలా విశేష లాభాలున్నాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
వృశ్చిక రాశి (Scorpio): గట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. వ్యక్తిగతంగా ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం సెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ధనస్సు రాశి (Sagittarius): అన్ని విధాలా కలసి వచ్చే కాలం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius): ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు వీలుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేపట్టవచ్చు. మిత్రులకు చేదోడు వాదోడుగా ఉంటారు. అంతా శుభమే జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. డబ్బు జాగ్రత్త.
మీన రాశి (Pisces): వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ఆదాయం పరవాలేదు కానీ, అనవసర ఖర్చులుపెరగకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా ఆలస్యంగా అయినా మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతిభా పాటవాలతో అధికారులను సంతోషపెడతారు. మనసులోని ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు..