వృషభ రాశి (Taurus): ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతు౦ది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తిప్పట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు చాలావరకు పూర్తవుతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి నిపుణులకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
కర్కాటక రాశి (Cancer): విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఆందోళనలు తగ్గుముఖం పట్టె అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. గురు ప్రభావం కారణంగా కొన్ని వ్యవహారాలు తేలికగా చక్కబడతాయి. డబ్బు జాగ్రత్త.
తుల రాశి (Libra): ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్గో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
వృశ్చిక రాశి (Scorpio): ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యంలో పాల్గొంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, పూర్తిగా పడక పెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. కోపతాపాలకు ఇది సమయం కాదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. డబ్బు నష్టపోతారు.
ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగంలో మార్పు సంభవం. వృత్తి నిపుణులకు విదేశాల నుంచి సానుకూల కబురు అందుతుంది. కొత్త అదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి బాగా కలిసి వస్తుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మార్గం అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.
మకర రాశి (Capricorn): ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేయాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో పలుకుబడివృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుంది. డబ్బు వ్యవహారాలు పెట్టుకోవద్దు. దగ్గరి బంధువులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంత౦ అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. భారీయెత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. మీ మీద అపనిందలు పడే అవకాశం ఉంది.
మీన రాశి (Pisces): ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం సంతృప్తి కరంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద ద్ద చూపిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరగవచ్చు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు.ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండడం మంచిది.