TELUGU ASTROLOGY GURU UDAY 2022 JUPITER WILL GOING TO RISE TODAY THESE ZODIAC SIGNS GET POSITIVE BENEFITS SK
Astrology: నేడు బృహస్పతి ఉదయం.. ఈ రాశుల వారికి పండగే.. మళ్లీ మంచి రోజులు..
Astrology | Jupiter Rise: నేడు బృహస్పతి ఉదయించబోతున్నాడు. దేవ గురు ఉదయం వల్ల పలు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మరి ఏయే రాశుల వారికి శుభాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం.
జ్యోతిషశాస్త్రంలో.. గ్రహాల రాశి పరివర్తనం, గ్రహాల ఉదయం, అస్తమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహాల మార్పు నేరుగా మనుషులపై ప్రభావం చూపుతుంది. కొందరికి శుభ ఫలితాలు వస్తే.. మరికొన్ని రాశులపై చెడు ప్రభావం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
నేడు గురుడు ఉదయించబోతున్నాడు. ఫిబ్రవరి నెలలో అస్తమించిన తర్వాత.. మళ్లీ ఇవాళ కుంభ రాశిలో ఉదయిస్తున్నాడు. బృహస్పతి ఉదయించిన తర్వాత రాశిని కూడా మర్చనున్నాడు. ఏప్రిల్ 13న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి వెళ్తారు. గురు ఉదయం వల్ల పలు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
మేషం: బృహస్పతి ఉదయించడంతో మేష రాశి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్థానికులకు శుభవార్తలు అందుతాయి. మీరు తండ్రితో కలిసి కొన్ని కొత్త పనులు చేసే అవకాశముంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
వృషభం: గురుగ్రహ ఉదయం వల్ల ఈరాశి వారికి శుభాలు కలుగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో పురోగతికి ఉంటుంది. ప్రమోషన్ రావొచ్చు లేదంటే జీతాలు పెరగవచ్చు. అత్తమామలతో సంబంధాలు మరింతగా పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
సింహం: సింహ రాశి వారికి గురు ఉదయ ప్రభావం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ధైర్యం, శక్తి పెరుగుతుంది. ధనార్జనలో ఆటంకాలు తొలగిపోతాయి. డబ్బులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త సంబంధాలు ప్రారంభం కావచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
తులారాశి: కుంభరాశిలో బృహస్పతి ఉదయించి.. తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో మీరు డబ్బు బాగా సంపాదిస్తారు. తోబుట్టువుల మద్దతు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
వృశ్చికం: వృశ్చిక రాశి వ్యక్తుల జీవితంలో ఆహ్లాదకరమైన మార్పు ఉంటుంది. మీ అభివృద్ధికి ఉన్న అన్ని అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. మీ జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. మానసిక సంతృప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
ధనుస్సు : చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. గురుడి ఉదయం వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. వీరు అనేక రంగాలలో లాభాలు పొందుతారు. కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
మకరం: మకర రాశి వారు ఈ కాలంలో ఏ పనులైనా మెరుగ్గా చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బుకు కొదువ ఉండదు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. కోర్టు పనుల్లో విజయం సాధించవచ్చు. ఆఫీసులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)