జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేకస్థానముంది. హిందూ పురణాల ప్రకారం.. బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తారు. అందుకే ఆయన్ను దేవగురువు బృహస్పతిగా పిలుస్తారు. బృహస్పతి చాలా వరకు శుభ ఫలితాలను మాత్రమే ఇస్తాడు. ఐతే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం అశుభ ఫలితాలను ఇస్తాడు.. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం: బృహస్పతి సంచారం మిథునరాశి వ్యక్తుల జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. దేవగురు మీనరాశిలో సంరించడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం: కర్కాటక రాశి వారికి బృహస్పతి అదృష్టం తీసుకొస్తుంది. నిరుద్యోగలకు ఉద్యోగం వస్తుంది. ఇప్పటిే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు. రచన మొదలైన వాటితో సంబంధం ఉన్న వ్యక్తుల జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. సంపద పెరగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)