Tarot Cards: చిలక జోస్యం లాంటిదే... ఆధునిక టారో కార్డ్స్ రీడింగ్ విధానం. ఇందులో... ఏ వ్యక్తి అయినా తన భవిష్యత్తును తెలుసుకోవడానికి... 78 కార్డుల్లో 3 కార్డులను బయటకు తీస్తారు. ఆ కార్డుల వెనక ఏమి ఉందో... ఆ వ్యక్తికి తెలియదు. ఆ కార్డులను చూసి... వాటిపై ఉన్న బొమ్మలు, ఆకారాలను బట్టీ... ఆ వ్యక్తి గతం, వర్తమానం, భవిష్యత్తును నిర్ణయిస్తారు టారో కార్డ్ రీడింగ్ నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)
తమకు అనంత విశ్వం నుంచి వచ్చే... సంకేతాలు, కాంతి, శక్తులు అన్నీ కలగలిపి... వాటికి ఈ మూడు కార్డుల్లో వచ్చిన బొమ్మలు, సంకేతాలను అన్వయించి... భవిష్యత్తును చెబుతున్నట్లు టారో కార్డ్ రీడర్లు చెబుతున్నారు. పైగా వారు సైకాలజీ నిపుణులు కావడంతో... వ్యక్తికి సంబంధించి చాలా వరకూ వాస్తవాలు చెప్పగలుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల టారో కార్డ్స్ రీడింగ్కి డిమాండ్ పెరుగుతోంది. తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి చాలా మంది ఈ విధానం పాటిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
సూట్ కార్డులను మైనర్ ఆర్కానా అంటారు. అంటే... సీక్రెట్ కార్డులు అని అర్థం. ఇలాంటి కార్డులు 22 ఉంటాయి. వీటిపై రకరకాల సింబాలిక్ బొమ్మలు ఉంటాయి. అలాగే పంచ భూతాలు ఉంటాయి. అలాగే... దైవ కార్యాల్లో మనుషులకు ఎదురయ్యే అనుభవాలు ఉంటాయి. అలాగే... ఆశలు, కన్నీళ్లు, ఆనందాలు, బాధలు అన్నీ ఈ కార్డులపై ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సహజంగా టారో కార్డ్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకునే వ్యక్తులు (క్లయింట్లు)... తాము ఎలాంటి వాళ్లం, తమ భవిష్యత్తు ఏంటి, తమకు ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారమేంటి అనేవి తెలుసుకోవాలి అనుకుంటారు. ఇవన్నీ టారో కార్డుల్లో ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఈ కార్డుల్లో మార్పులు-చేర్పులూ జరుగుతున్నాయి. మయన్లు, చైనీయులు, ఈజిప్షియన్లు... ఇలా వివిధ చరిత్రల్లో జరిగే అంశాల ఆధారంగా వీటిపై బొమ్మల్లో మార్పులు వచ్చాయి. మొదట్లో ఈ కార్డులను ఏనుగు దంతాలు, వెంటి ప్లేట్లు, బంగారు ప్లేట్లతో తయారుచేసేవారు. కాలక్రమంలో చెక్క కలపపై చెక్కారు. ఆ తర్వాత బలమైన పేపర్ ముక్కలపై చెక్కుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా ఇవి తక్కువ ధరకే లభిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
టారో కార్డు నిపుణులకు ఈ 78 కార్డుల్లో బొమ్మలు, సంకేతాలు, నంబర్లపై పూర్తి అవగాహన ఉంటుంది. అలా లేని వాళ్లు భవిష్యత్తును చెప్పలేరు. క్లియింట్లు తీసే 3 కార్డులూ... యథాలాపంగా తియ్యరు... వాటి వెనక... అనంత శక్తుల ప్రభావం ఉంటుంది... అందువల్లే వారి భవిష్యత్తును కచ్చితంగా అంచనా వెయ్యడానికి వీలవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)