Tarot Card Reading: మీకు చిలుక జ్యోస్యం తెలుసుగా. కొన్ని పేకముక్కల లాంటి కార్డులను జ్యోతిషుడు... చిలుక ముందు పెడతాడు. చిలుక పంజరం లోంచీ బయటకు ఓ కార్డు నోటితో తీసి లోపలికి వెళ్లిపోతుంది. ఆ కార్డుకి ఒకవైపు దేవుడి బొమ్మో, పామో, ఇంకేదైనా సింబలో ఉంటుంది. దాన్ని చూసి జ్యోతిషుడు... మీ జ్యోతిషం ఇలా ఉంటుంది... భవిష్యత్తు ఇలా ఉంటుంది. మీకు ఈ సమస్యలు ఉన్నాయి. ఈ తాయత్తు కట్టించుకుంటే... అవి దూరమవుతాయి... అని ఆ తాయత్తును అమ్ముతారు. ఇదంతా పల్లెల్లో కనిపించే పాతకాలపు జ్యోతిషం. ఇప్పుడు ఇదే జ్యోతిషం... డెవలప్ అయ్యింది. మోడ్రన్ కలర్స్ అద్దుకుంది. ఇందులో చిలక లేదు... మిగతా అంతా సేమ్ ఉంటుంది. దీన్నే టారో కార్డ్ రీడింగ్ అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
టారోకార్డ్ విధానంలో... మనం 3 కార్డులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డుల్లో ఒకటి గతానిది... ఒకటి వర్తమానం... మూడోది భవిష్యత్తుకు సంబంధించినది అవుతుంది. ఆ కార్డులపై ఉన్న సింబల్స్, బొమ్మలను చూసి... వాటి ఆధారంగా మన భవిష్యత్తును చెబుతారు టారో కార్డ్ రీడర్స్. ఇది 15వ శతాబ్దంలో యూరప్‌లో పుట్టింది. ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ ఆదరణ పొందుతోంది. చాలా మంది టారో జ్యోతిషులను నమ్ముతున్నారు. వాళ్లు కరెక్టుగా చెబుతున్నారని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
టారో కార్డ్ రీడింగ్ అంటే జ్యోతిషం కాదు. ఎందుకంటే... జ్యోతిషులు పుట్టిన తేది, ప్రదేశం, గ్రహ బలాలు, జన్మ నక్షత్రం, రాశులు, సూర్యుణ్ని బట్టి భవిష్యత్తును అంచనా వేస్తారు. టారో కార్డు రీడర్లు మాత్రం తమ దగ్గరకు వచ్చేవారు ఎంచుకున్న కార్డుల్ని చదివి వారి గతం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది... ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెబుతారు. అనంత విశ్వం నుంచి తమ మైండ్లోకి వచ్చే శక్తి ద్వారా తాము ఇది చెప్పగలం అంటారు వారు. (ప్రతీకాత్మక చిత్రం)
టారో కార్డు రీడింగ్‌లో 78 కార్డులు ఉంటాయి. ఒక్కో కార్డుకు 30 విభిన్నమైన అర్థాలు ఉంటాయి. 6, 12, 18... ఇలా నిర్దేశిత సంఖ్యలో కార్డులను ఎంచుకోవాల్సి ఉంటుంది. క్లయింట్లు ఎంపిక చేసుకున్న కార్డులను రీడర్లు చదివి... అందులోని సందేశాన్ని వివరిస్తారు. సహజంగా ఏదైనా సమస్య ఉన్నవారే... టారోల దగ్గరకు వెళ్తారు. ఆ సమస్యను తెలుసుకొని... తీసిన 3 కార్డుల ఆధారంగా ఆ సమస్య ఎలా పరిష్కరించాలో డిసైడ్ చేస్తారు. అందుకే ఇది బాగుందని చాలా మంది అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
సంప్రదాయ చిలుక జ్యోతిషులు బాగా చదువుకున్నవారేమీ కాదు. టారో కార్డు రీడర్లు మాత్రం బాగా చదువుకున్న వారు అయి ఉంటారు. వాళ్లకు సైకాలజీపై మంచి పట్టు ఉంటుంది. మంచి కమ్యూనికేషన్, కౌన్సెలింగ్ స్కిల్స్‌తో క్లయింటు సమస్యను అర్థం చేసుకునే టాలెంట్ ఉంటుంది. 10 నుంచి 15 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్న వారికి మనుషుల తీరును బట్టి... ఫ్యూచర్‌ను ఊహించగలిగే టాలెంట్ ఉంటుంది. అందువల్ల ఈ టారో కార్డ్ రీడింగ్‌పై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
టారో కార్డు రీడర్లలో కొందరు మోసపూరితమైన వాళ్లు కూడా ఉంటారు. హడావుడి ఎక్కువ... మేటర్ తక్కువ ఉంటుంది వాళ్ల దగ్గర. ప్రధానంగా... 78 కార్డులపై పూర్తి పట్టు ఉన్నవారే... సరైన టారో చెప్పగలరు. మరి అన్ని కార్డులపై పట్టు రావాలంటే... లోతైన అధ్యయనం చెయ్యాలి. ఏ కార్డుకి ఏ మీనింగ్ ఉంటుందో గ్రహించాలి. అందులో సింబల్స్ ఆధారంగా చెప్పగలగాలి. సపోజ్... డెత్ కార్డ్‌ను క్లయింటు తీస్తే... కొంత మంది త్వరలో చనిపోయే ప్రమాదం ఉంది అంటారు... నిజానికి డెత్ కార్డులో చాలా అర్థాలు ఉంటాయి. త్వరలో కుటుంబంలో ఎవరో పుట్టబోతున్నారు అనే అర్థం కూడా అందులో వస్తుంది. ఇలా చాలా వైవిధ్యం ఉంటుంది. కాబట్టి అనుభవం లేని టారో కార్డు రీడర్లను సంప్రదిస్తే... వేస్టే. (ప్రతీకాత్మక చిత్రం)
టారో కార్డు రీడింగ్‌పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతుంటాయి. టారో కార్డు ఎనలిస్టులుగా కెరీర్ డెవలప్ చేసుకోవాలి అనుకునేవారు ఆ కోర్సులు ఎక్కడ చెబుతున్నారో, ఎవరు చెబుతున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్‌లో ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. వారి ద్వారా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. ఐతే... ఇది నెలల్లో వచ్చేసే కోర్సు కాదు. సంవత్సరం కంటే ఎక్కువ టైమే పడుతుంది. కోర్సు నేర్చుకునేటప్పుడు ఏమాత్రం రాజీ పడిపోయినా... ఇక అసలైన టారో కార్డ్ రీడర్ అవ్వలేరని గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)