Tarot: టారో కార్డులు మనం చూడ్డానికి పేక ముక్కలలా ఉన్నా... టారో కార్డు రీడింగ్ నిపుణులకు మాత్రం అవి అద్భుతాలు. వాటి నుంచి వారు ప్రత్యేక భాషను రాబట్టుకుంటారు. సంకేతాలను గ్రహిస్తారు. భవిష్యత్తును తెలుసుకుంటారు. టారోకార్డులపై ఉండే ప్రతీ సింబల్, దృశ్యం, గీతలు, సంకేతాలు అన్నింటికీ ప్రత్యేక అర్థం ఉంటుందనీ... అవి మనిషి జీవితంతో ముడిపడి ఉంటాయని వారు చెబుతుంటారు. టారో కార్డులు రకరకాలు ఉన్నాయి. అలాగే వాటిపై థియరీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. అన్నింటికీ అర్థం పరమార్థం మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. అన్ని కార్డులతోనూ భవిష్యత్తును చెబుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
అసలు టారో కార్డులు ఎలా పుట్టాయి... ఎవరు వాటిని మొదటిసారి వాడారనేది కచ్చితమైన ఆధారాలు లేవు. మొదట్లో కార్డులకు బదులు... మూఢ నమ్మకాలు బాగా ఉండేవి. ఊహాగానాలు, గాలిలో చూస్తూ... అంచనాలు వేయడం, భవిష్యత్తును ఊహించడం వంటివి జరిగాయి. ఆ తర్వాత క్రమంగా ఆ నాలెడ్జిని కార్డులపైకి తెచ్చారు. ఇది ఈజిఫ్టు, గ్రీకుల కాలంలో జరిగిందని చెబుతారు. ముఖ్యంగా జిప్సీలు రకరకాల సింబల్స్ ద్వారా భవిష్యత్తును చెప్పడం ప్రారంభించారని అంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
దేవుడు, విశ్వం, మనిషి ఈ మూడు అంశాలతో ముడిపడి ఉంటుంది టారో కార్డ్ రీడింగ్. మనిషి భవిష్యత్తును ఈ విశ్వం నుంచి వచ్చే అదృశ్య శక్తులు చెబుతాయని టారో కార్డ్ రీడర్లు అంటారు. 78 కార్డుల్లో మనిషి తన భవిష్యత్తు తెలుసుకోవడానికి తీసే 3 కార్డుల వెనక కూడా అదృశ్య శక్తుల హస్తమే ఉందంటారు వారు. ఆ శక్తుల ద్వారానే ఆ వ్యక్తి... ఆయా కార్డులను ఎంచుకుంటారని అంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
మధ్యధరా సముద్ర ప్రాంతంలో... టారో కార్డులను వాడినట్లు తెలుస్తోంది. అలాగే... రొమేనియాలో... 14వ శతాబ్దం నుంచి ఈ కార్డులు వాడుకలోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఆస్ట్రియాలో 20వ శతాబ్దం నుంచి ఇవి అమల్లో ఉన్నాయి. టార్ అనే పదం... హంగేరియన్లలోని జిప్సీలు పలికేవారు. టార్ అంటే... కార్డుల సమూహం (pack of cards) అని అర్థం. (ప్రతీకాత్మక చిత్రం)
ఈజిఫ్టులో అలెగ్జాండ్రియాలోని గ్రేట్ లైబ్రరీ నాశనమైపోయాక... చాలా మంది మేధావులు... ప్రపంచమంతా మాట్లాడుకునే సంకేతాల భాష కావాలని కోరుకున్నారట. తద్వారా వారు విచిత్రమైన, ఆశ్చర్యం కలిగించే బొమ్మలు, చిత్రాలతో ఓ పుస్తకం తయారుచేశారు. అందులోనే మనిషి పుట్టుక, చావు, జీవితం, సంతోషాలు, బాధలు అన్నింటికీ అర్థాలు ఉండేలా చేశారు. క్రమంగా అదే టారో కార్డులుగా మారిందంటారు. కార్డులపై ఉండే బొమ్మలన్నీ వారు లోతుగా ఊహించి, దైవం ద్వారా సృష్టించినవే అని నమ్ముతారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ కార్డులు మొదట్లో కొన్ని చోట్ల 22, కొన్నిచోట్ల 20, కొన్నిచోట్ల 140 దాకా ఉండేవి. కాలక్రమంలో వాటిని క్రోడీకరిస్తూ... 78కి సెట్ చేశారు. ప్రస్తుతం ఈ 78 కార్డులే మనిషి గతం, వర్తమానం, భవిష్యత్తును నిర్దేశిస్తాయని అక్కలిస్టులు (occultists) నమ్ముతున్నారు. ఈ అక్కలిస్టులు... తమకు అదృశ్య శక్తులు ఉన్నాయని నమ్ముతారు. దైవమే తమకు ఆ శక్తులు ఇచ్చిందని భావిస్తారు. అలాగే... వీరు ఎన్నో రహస్యాలు కలిగి ఉన్నట్లు భావిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
సింపుల్గా చెప్పాలంటే... అటు దైవత్వం, ఇటు మ్యాజిక్... రెండూ మిక్స్ చేస్తారు. మిగతా మనుషులకు లేని అద్వితీయమైన లోతైన గ్రాహక శక్తులు తమకు ఉన్నాయని బలంగా నమ్ముతారు. వీరే ఈ రోజుల్లో టారో కార్డ్ రీడర్లుగా ఉంటున్నారు. వీరు మనుషుల సైకాలజీని లెక్కలోకి తీసుకొని... వారి భవిష్యత్తును టారో కార్డుల ద్వారా నిర్దేశిస్తున్నారు. చాలా మంది వారు చెప్పేది నిజం అని నమ్ముతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)