సింహం: ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. ఆదాయం పెరగడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు. తద్వారా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యారంగంతో అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం వరం లాంటిది. ఈ కాలంలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం: ఈ సమయంలో మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం శుభప్రదం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)