సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడాన్ని సంక్రాంతి అంటారు. మకర రాశిలోకి వెళ్తే మకర సంక్రాంతి.. మీన రాశిలోకి వెళ్తే మీన సంక్రాంతిగా పిలుస్తారు. ఇక గ్రహాల రాజు సూర్యభగవానుడు ఈ రోజు అంటే నవంబర్ 16న రాశిని మార్చుకున్నాడు. ఈరోజున తులరాశిని విడిచిపెట్టి వృశ్చిక రాశి లోకి (Sun Transit in Scorpio) ప్రవేశించాడు.
కర్కాటకం (Cancer): మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు.నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. (PC: Pixabay)
వృశ్చికం (Scorpio): సూర్యభగవానుడి వల్ల ఈ రాశివారికి రాజయోగం ఏర్పడుతోంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా పదవిని పొందవచ్చు. ఈ రాశి యెుక్క దశమి స్థానానికి సూర్యుడు అధిపతి. అంతేకాకుండా మీ రాశిచక్రంలోని లగ్న గృహంలో సంచరిస్తాడు. ఈ రాశి వారికి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. (PC: Pixabay)
మకరం (Capricorn): మకరరాశి యెుక్క ఎనిమిదవ ఇంటికి సూర్యుడు అధిపతిగా పరిగణించబడ్డాడు. నవంబర్ నెలలో సూర్యుడు మీ పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సూర్య సంచారం వల్ల మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీ సోదరసోదరీమణుల సపోర్టు లభిస్తుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ సమేతంగా సంతోషంగా ప్రయాణాలు చేయవచ్చు. (PC: Pixabay)