ప్రధానంగా ఆదివారం రోజు ఎవరు కూడా తలకు నూనెను పెట్టుకొకూడదు. దీని వలన అనేక దోషాలు అంటు కుంటాయి. దీనితో పాటు మద్యం, మాంసాన్ని కూడా ముట్టుకోకూడదు. కానీ చాలా మంది ఆదివారం సెలవు దినం కాబట్టి నాన్ వేజ్ తెచ్చుకుంటారు. చాలా మంది పార్టీల పేరిట.. ఆదివారం తాగుతుంటారు. కానీ వీటి వలన వారికి చెప్పలేని దోషాలు వచ్చిపడతాయి.
మనం కేవలం రెండు చేతులు జోడించి నమస్కరిస్తే సూర్యుడి ఎంతో ఆనందపడతాడు. మనం కోరిన కొర్కెలను తీరుస్తాడు. శనిభగవానుని తండ్రి సూర్యుడు.కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే.. శనిబాధలు కూడా మనకు ఉండవు. మనకు దరిదాపుల్లోకి కూడా శనిదేవుడు తొంగి చూడడు. ఇలాంటి నియమాలను పాటించాలని కొంత మంది జ్యోతిష్యులు తెలిపారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)