మార్చి 14 అర్ధరాత్రి 12.16 గంటలకు మీన సంక్రాంతి జరుగుతుంది. ఏప్రిల్ 14 వరకు ఈ రాశిలోనే సూర్యుడు ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానమాచరించడం శ్రేయస్కరమని అంటున్నారు. ఈ నేపథ్యంలో మీనంలో సూర్యుడి ఆగమనం (Sun Transit) వల్ల రాశులపై (Zodiac signs) ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం.
మేషం
సూర్యుడు మీ రాశి నుంచి 12వ పాదంలో ప్రవేశిస్తాడు. మీనంలో సూర్యుడు సంచారం వల్ల ఈ సమయంలో మీరు లైంగిక ఆనందాన్ని పొందుతారు. మీ గృహ జీవితం సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఇదే సమయంలో కొన్ని పనులపై డబ్బు ఖర్చు చేస్తారు. హస్తకళ లేదా యంత్ర సంబంధిత పనులు చేసే వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయాలి. సూర్యుడి శుభ ఫలితాలను నిర్ధారించడానికి ఆధ్యాత్మిక పనుల్లో ఆర్థికంగా లేదా భౌతికంగా మద్దతునిస్తూ ఉండాలి.
వృషభం
సూర్యుడు మీ రాశి నుంచి 11వ పాదంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా మంచి ఫలితాలను పొందుతారు. సూర్యుడు శుభ ఫలితాలను నిర్ధారించడానికి ఆదివారం అర్ధరాత్రి మంచం పక్కన 2 ముల్లంగులను ఉంచుకుని నిద్రించండి. ఉదయం లేచిన తర్వాత దేవాలయం వద్ద దానం చేయండి.
కర్కాటకం
సూర్యుడు మీ రాశి నుంచి 9వ పాదంలో ప్రయాణిస్తాడు. ఈ సమయంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఈ సమయంలో మీకు సోదరుల నుంచి పెద్దగా మద్దతు లభించదు. కాబట్టి సూర్యుడి అశుభ ఫలితాలు రాకుండా ఉండాలంటే ఏప్రిల్ 14 వరకు ఇంట్లో ఇత్తడి పాత్రలు వాడండి. ఒకవేళ లేకుంటే కొనుగోలు వాటిని కొనుగోలు చేయండి.
* కన్య
సూర్యుడు మీ రాశి నుంచి ఏడో పాదంలో సంచరిస్తాడు. ఈ పాదం మీ జీవిత భాగస్వామిని సూచిస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వారు పురోగతి చెందుతారు. సూర్యుడి శుభ ఫలితాలను నిర్ధారించడానికి ఆహారం తినే సమయంలో మీతో పాటు ఎవరికైనా ఇతరులతో పంచుకోండి. కార్యాలయం, పాఠశాల, కాలేజీల్లో ఎక్కడ ఉన్నా ఇలా చేయండి.
తుల
సూర్యుడు మీ రాశి నుంచి ఆరో పాదంలో ప్రవేశిస్తాడు. ఈ పాదం స్నేహితులకు చెందింది. అందువల్ల రాబోయే రోజుల్లో మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ఇదే సమయంలో మీరు మీ శత్రువులతోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లల పట్ల వినయపూర్వకంగా ఉంటారు. ఈ స్వభావం మీ పురోగతిని నిర్ధారిస్తుంది. సూర్యుడి శుభ ఫలితాలను పొందడానికి కుక్కలకు ఆహారాన్ని తినిపించండి.
ధనస్సు
మీ రాశి నుంచి సూర్యుడు నాలుగో పాదంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో భూమి, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా డబ్బు పొందుతారు. అయితే ఈ సమయంలో మీ పిల్లలు కూడా ఆర్థికంగా లాభపడతారు. ఇది కాకుండా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులను మరింత తెలివితో చేయగలుగుతారు. సూర్యుడి శుభఫలితాలను నిర్ధారించడానికి ఆకలితో ఉండేవారికి ఆహారం అందించండి.
* మకరం
మీ రాశి నుంచి సూర్యుడు మూడో పాదంలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీకు మీ సోదరులు, సోదరీమణుల నుంచి మద్దతు పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే పనికోసం ఇతరులపై ఆధారపడరు. మీ సొంత శ్రమ, బలంతో డబ్బును సంపాదిస్తారు. మీ కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తుంది. సూర్యుడి శుభ ఫలితాలను నిర్ధారించడానికి దేవాలయానికి వెళ్లి సేవా కార్యక్రమాలు చేయండి.
మీనం
మీ రాశిలోనే సూర్యుడు ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీరు అన్ని రకాల ఆనందాలను పొందుతారు. అంతేకాకుండా మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు మీ తెలివితేటలతో పరిస్థితిని మరింత మెరుగుపరచుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు శారీరకంగా దృఢంగా ఉంటారు. వ్యాపార సంబంధిత ప్రయాణాల్లో మీరు లాభాలను అందుకుంటారు. సూర్యుడి శుభ ఫలితాలను నిర్ధారించడానికి సూర్య దేవుడికి నీటిని సమర్పించండి.