అదే 3, 12, 21,30 తేదీల్లో జన్మించి వారికి 3 ఉంటుంది. ఒకవేళ 29వ తేదీన పుడితే.. వారి ర్యాడిక్స్ 2 (2+9=11, 1+1=2) అవుతుంది. ఐతే సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ర్యాడిక్స్ 2, 3, 5 కలిగిన వారు.. అంటే 2, 3, 5, 11, 12, 14, 20, 21, 23, 29, 30 తేదీల్లో పుట్టిన వారు.. మే 22 వరకు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలని న్యూమలరాజీ నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
రాడిక్స్ 2: ఈ వారం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. డబ్బు నష్టం జరగవచ్చు. ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి రావచ్చు. వ్యాపారంలో కొత్త వ్యక్తులను కలిసే అవకాశముంది. మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసే వారు విజయం సాధిస్తారు. ఇన్నాళ్లు కూడబెట్టిన డబ్బంతా తగ్గిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రాడిక్స్ 3: మే 22 వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు మీకు భంగం కలిగిస్తాయి. డబ్బంతా కరిగిపోతుంది. ఆర్థిక ఇబ్బందలు రావచ్చు. మీకు సంబంధం లేని.... పనికిరాని విషయాలలో అస్సలు తలదూర్చవద్దు. ఈ వారం కొన్ని శుభవార్తలు వినే అవకాశముంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాల్సి రావచ్చు. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది.