ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం 8, వ్యయం 11
రాజపూజ్యం 6, అవమానం 3.
ప్రధాన గ్రహాలైన శని, గురు, రాహువులు, కేతువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారు ఈ ఏడాదంతా సుఖసంతోషాలతో మునిగి తేలుతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులు ఈ రాశి వారి సలహాలు సూచనలు పాటించి ఎంతగానో ప్రయోజనం పొందుతారు.
ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం అక్కడ స్థిర పడటం వంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారాల వారు కూడా ఆశించినంతగా లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపా రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు.
కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
మనసులోని ఆలోచనలను, పథకాలను, ప్రయత్నాలను ఇతరులకు చెప్పకపోవడం మంచిది. నర ఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్నేహితులలో, సహచరులలో రహస్య శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రాకపోవచ్చు. ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు మరింత ఎక్కువగా అనుభవానికి వస్తాయి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)