వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం 5, వ్యయం 5
రాజపూజ్యం 4, అవమానం 5.
నాలుగవ రాశిలో శనీశ్వరుడు, ఆరవ రాశిలో గురు రాహువులు, 12వ రాశిలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబంలో సుఖం, మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సరైన పరిహారాలు
అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యసనాలు జోలికి వెళ్ళవద్దు. ఎక్కడా మాట తూల వద్దు. స్నేహితులతో అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మీద దృష్టి కేంద్రీకరించడం ప్రస్తుతానికి చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం లలితా సహస్రనామం పఠించడం వల్ల సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)