మేషం.. ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది. దీంతో గ్రహణ ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడంతో మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. అలాగే పరుగెత్తడం మానుకోండి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ప్రయాణం చేయకూడదు.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే సూర్యగ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపించనుంది తదితర వివరాలను నాసా వెల్లడించింది. ఏప్రిల్ 30న ఏర్పడేది తొలి పాక్షిక సూర్యగ్రహణమని, దక్షిణ అమెరికాలోని దక్షిణాధి ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు ఏప్రిల్ 30న సూర్యాస్తమయానికి ముందు కొంతసేపు పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)