మేషం (Aries): మేష రాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపార పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది, కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పెట్టుబడి పెట్టడం వల్ల చాలా లాభాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా అందులో ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు దూరమవుతాయి. కార్యాలయంలో మీకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభం వస్తుంది. ధనలాభం కలుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)