మీనరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల గురు-శుక్ర సంయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రోజున ప్రదోష వ్రతం కూడా పాటిస్తారు. రాశి చక్రంలో మార్పులు, గ్రహాల్లో తాజా కదలిక.. శుభ కార్యాల పరంగా చాలా ముఖ్యమైనది. గజకేసరి యోగంలో శుక్రుడి రాశి పరివర్తనం, గురు-శుక్ర సంయోగం వల్ల ఏడు రాశుల వారికి మంచి జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం: మేష రాశి వారికి గజకేసరి యోగంలో శుక్రుడు రాశి మారడం వల్ల అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు, దుకాణం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)