ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అమావాస్య కేలండర్ని పాటిస్తారు. దాని ప్రకారం ఈ సంవత్సరం శ్రావణమాసం ఆగస్టు 9న మొదలై, సెప్టెంబర్ 7న ముగుస్తుంది. శ్రావణ మాసం రావడంతోనే... తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇక్కడి నుంచి దీపావళి (నవంబర్) వరకూ దాదాపు 4 నెలలపాటూ... వేర్వేరు పండుగలు వస్తూ ఉంటాయి.
అలా వెళ్ళిన అమ్మవారు... తిరిగి అమృతం కోసం దేవతలు, రాక్షసులు... క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల కడలి నుంచి ఆవిర్భవించినట్లు చెబుతారు. ఐతే... అమ్మవారి కంటే ముందుగా... సముద్రం నుంచి విషం బయటకు వచ్చినప్పుడు... ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే శ్రావణమాసంలో పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు.