దక్షిణాది రాష్ట్రాల్లో ఆగస్ట్ 9న శ్రావణమాసం మొదలవుతుంది. మన పురాణాల ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో సోమవారాలు అత్యంత ఎక్కువ పవిత్రమైనవి. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం... పరమశివుడికి పూజలు చేస్తే... జన్మజన్మల ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. పూజ మాత్రమే కాదు... శైవ భక్తులు ఈ నెలలో ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. అంతేకాదు ప్రతి సోమవారం ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తారు. శివపురాణం ప్రకారం ముక్కంటికి పూజలు చేస్తారు.