శని దోషం (shani dosha) పడితే... ఎన్నో సమస్యలొస్తాయి. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు, శత్రువులు పెరుగుతారు, రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలుంటాయి. శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమ మైన రోజు శని త్రయోదశి. శనివారం (saturday) రోజున త్రయోదశి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. సెప్టెంబర్ 4న శని త్రయోదశి కాబట్టి... ఎలాంటి పూజలు చెయ్యాలో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
శని త్రయోదశి నాడు శనీశ్వరుడి (Shani dev) ఆలయానికి వెళ్లి పూజలు చేయడం ద్వారా... మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఆలయానికి వెళ్లలేకపోతే... శని దేవుడి ఫొటోని ఉంచి పూజలు చెయ్యాలి. ఆలయానికి వెళ్లిన వారు పూజలు చేశాక... గుడి నుంచి బయటకు వెళ్తూ... వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చూస్తే... శని దేవుణ్ని మీతో ఆహ్వానించినట్లే. అలా చేస్తే... దోష నివారణ పూజలన్నీ వృథా అవుతాయనీ, మళ్లీ శని దోషం పట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఏలిన నాటి శని, అష్టమ శని దోషాలు ఉన్నవారు... శని త్రయోదశి నాడు ప్రత్యేక పూజలు చెయ్యాలి. శని త్రయోదశి అనేది శనిదేవుడు జన్మించిన తిథి కాబట్టి... ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. అందువల్ల ఇవాళ శని దేవుడికి చేసే చిన్న పూజ అయినా ఎన్నో రెట్ల ఫలితం ఇస్తుందని పండితులు చెబుతున్నారు. పూజలో భాగంగా... నువ్వుల నూనె (Sesame oil) తో శని దేవుడికి అభిషేకం చెయ్యాలి. శనిదేవుడి వాహనమైన కాకికి నైవేద్యం పెట్టాలి. అలాగే నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో ఉంచి పేదవారికి దానం చెయ్యాలి. (ప్రతీకాత్మక చిత్రం)
పూజలో భాగంగా శనిదేవుడి స్తోత్రం పఠించాలి. అది... "నీలాంజన సమాభాసం... రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం... తం నమాని శనైశ్చరం". ఈ మంత్రాన్ని రోజులో 10 సార్లైనా చదివితే... మంచి ఫలితం వస్తుందని పండితులు తెలిపారు. శని త్రయోదశి నాడు పఠిస్తే... పది రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రోజున శివుణ్ని (lord shiv) ఆరాధించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. శని ప్రదోష ఉపవాస సమయంలో శివుడిని పూజిస్తారు. ఈ రోజు అన్ని నియమాలూ పాటిస్తూ ముక్కంటిని పూజిస్తే కష్టాలు తొలగిస్తాడని ప్రతీతి. హిందూ క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ 4న ఉదయం 8.24 నుంచి సెప్టెంబర్ 5 రాత్రి 8.21 మధ్య ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ ఆరాధన చెయ్యవచ్చు. ఆలయాల దగ్గర నవగ్రహ విగ్రహాలు ఉంటాయి. అక్కడ పూజలు చెయ్యాలి. (ప్రతీకాత్మక చిత్రం)