వృషభం (Taurus): మకరరాశిలో శని సంచారం వృషభ రాశి వారికి శుభాలను కలిగిస్తుంది. ధన్తేరస్ రోజు నుంచి అదృష్టం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. డబ్బుకు, తిండికి లోటు ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం ఉంటాయి. స్టాక్ మార్కెట్, లాటరీల్లో లక్కు కలిసి వస్తుంది. మీఆరోగ్యం బాగుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (Gemini): శని గ్రహ మార్గి వల్ల మిథున రాశికి అనేక బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కొంత కాలంగా వేధిస్తున్న వ్యాధులు దూరమవుతాయి. మీ శత్రువు బలహీనంగా ఉంటాడు. ఇంట్లో తగాదాలు సమసిపోతాయి. కొత్త స్నేహితులు, సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవితంలోని ఒత్తిళ్లన్నీ తొలగిపోతాయి. విద్యార్థులకు ఇది శుభ సమయం. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభం ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. మీ పిల్లల నుంచి ఆనందాన్ని పొందుతారు. కుటుంబ కలతలు తీరుతాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. జీతం పెరిగే సూచనలున్నాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)