కర్కాటకం (Cancer): శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటకరాశి వారిపై శని ప్రభావం మొదలైంది. శనిదేవుడు మీ జాతక చక్రంలోని ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నాడు. అందువల్ల రాబోయే రోజుల్లో మీకు కష్టాలు రాబోతున్నాయి. ఉద్యోగం చేసే వ్యక్తులు తమ కార్యాలయంలో చాలా పని ఒత్తిడిని చూస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (Virgo): ఈ రాశి వారు 2025 సంవత్సరం వరకు అనారోగ్య సమస్యలు, అపజయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పనుల్లో మిశ్రమ ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. కుటుంబంలో గొడవలు పెరగవచ్చు. దీని కారణంగా మీరు చాలా మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)