కొంతమంది నా టైమ్ బాలేదు అంటారు. నిజానికి టైమ్ ఎవరికైనా ఒకేలా ఉంటుంది. అందరికీ రోజుకు 24 గంటలే. కాకపోతే... పరిస్థితులు కొంత మందికి డబ్బును దూరం చేస్తాయి. సంపాదించినది నీళ్లలా ఖర్చైపోతుంది. కష్టాలతో అప్పులు చేస్తే... వడ్డీలు కొండల్లా మారతాయి. పనిలోనూ విజయం దక్కదు. ఇలాంటి బాధల్లో ఉన్న అందరికీ... చిటికెడు ఉప్పే సమాధానం చెప్పగలదంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
మనశ్సాంతి లేనివారు... ఎక్కడికి వెళ్లినా నిరాశ, నిస్పృహలో ఉంటుంటారు. అలాంటి వారు తమ జేబులో ఓ చిన్న ఉప్పు ప్యాకెట్ (ఉప్పును పొట్లంలా చుట్టుకొని) పెట్టుకోవాలట. అంతే... ఆ ఉప్పు నెగెటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. తద్వారా... వారి జీవితంలో అశాంతి పోయి... హాయిగా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఓ బకెట్లో నీరు తీసుకొని... దాంట్లో చిటికెడు ఉప్పు కలిపి... ఇంటి ముందు ఆ బకెట్‌ను అలా ఉంచండి. అంతే... ఇంట్లోకి రాబోతున్న నెగెటివ్ ఎనర్జీని ఆ బకెట్లో ఉప్పు లాగేసుకుంటుంది. దాంతో... ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి అని వాస్తు శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these.)