Rose day 2023: ఏ రాశి వారికి ఏ పువ్వుతో ప్రపోజ్ చేయాలి?
Rose day 2023: ఏ రాశి వారికి ఏ పువ్వుతో ప్రపోజ్ చేయాలి?
Rose day 2023: వాలెంటైన్స్ డే వీక్ రోజ్ డేతో ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ప్రపోజ్ చేయాని వాళ్లు.. ఇప్పటికే ప్రేమికులుగా ఉన్నవాళ్లు రోజ్ఇచ్చి తమ ఇష్టాన్ని చెప్పుకుంటారు. అయితే ఏ రాశి వారికి ఏ కలర్ పువ్వు ఇస్తే బాగుంటుంది.
మేషరాశి: ఈ రాశికి వారికి ఎరుపు రంగు ఎంతో మంచిది. ఇది వాళ్లకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపారాల్లో విజయం సాధించేందుకు ఈ కలర్ వాళ్లకి ప్లస్ అవుతుంది. ఈ కలర్ ఫ్లవర్‌తో ప్రపోజ్ చేసి చూడండి.
2/ 12
వృషభం: వృషభ రాశి వారు కళాత్మకంగా ఆలోచిస్తారు. వృషభం ప్రశాంతతకు సంకేతం. ఇది పట్టుదల, సహనం, విశ్వసనీయతను సూచిస్తుంది. అందుకే వృషభ రాశి వారికి పింక్ కలర్ గులాబీలు ఉత్తమమైనవి.
3/ 12
మిధునరాశి: ఇది ఉష్ణమండల రాశిచక్రం. వీరికి పింక్, పసుపు, ఆకుపచ్చ రంగులు బెస్ట్. ఈ మూడిట్లో ఏదో ఒక కలర్ రోజ్ ఇచ్చి మీ ప్రేమను చెప్పండి.
4/ 12
కర్కాటకరాశి: మోషనల్ గా ఉంటారు. వీరు వీరి ఫ్రెండ్స్, ఫ్యామిలీని ఎంతో ప్రేమిస్తారు. వీరికి ఇంట్యూషన్ కూడా ఎక్కువే. వీరికి తెలుపు, పసుపు పచ్చ, నీలం, సీ గ్రీన్ కలర్స్ బెస్ట్. వీటిలో ఏదో ఒక కలర్ ఫ్లవర్‌తో మీ మనసుకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయండి.
5/ 12
సింహరాశి: సూర్యుడు సింహ రాశికి అధిపతి. ఎరుపు, నారింజ, పసుపు రంగులు ఈ రాశి వారికి ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉంటాయి. మీరు ప్రేమించిన వారు సింహరాశి వారైతే అ కలర్స్‌లోని ఏదో ఒక రోజా పువ్వుతో మీ ప్రేమను తెలియజేయండి.
6/ 12
కన్య: కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. వారు ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆ కలర్ పువ్వుతో మీ ప్రేమను వ్యక్తపరచండి.
7/ 12
తులారాశి: తుల రాశికి అధిపతి శుక్రుడు వారు ఎల్లప్పుడూ తెలుపు, వెండి రంగుల వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు ప్రేమించిన వారు తులారాశి వారైతే వైట్ కలర్ రోజ్ ఇవ్వండి.
8/ 12
వృశ్చిక రాశి : బాగా పవర్ఫుల్ నేచర్ వీరిది. అందుకే బాగా గాఢమైన రంగులైన పర్పుల్, రెడ్, మెరూన్, బ్లాక్ వీరికి బాగా సూట్ అవుతాయి. మీకు నచ్చిన వారు ఒకవేళ వృశ్చికరాశి అయితే వీటిలో ఏదో ఒక కలర్ ఫ్లవర్ ఇచ్చి చూడండి.
9/ 12
ధనుస్సు రాశి: ధనుస్సు రాశిని పాలించే గ్రహం బృహస్పతి. ఈ రాశికి చెందిన వారికి పసుపు రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. అందుకే ఆ కలర్ పువ్వుతో మీ ప్రేమను వ్యక్తపరచండి.
10/ 12
మకర రాశి : వీరి వాస్తవిక దృక్పథానికి గ్రే, బ్రౌన్ బాగా సూట్ అవుతాయి. మీరు ప్రేమించిన వారు మకరరాశి వారైతే బ్రౌన్ కలర్ పువ్వుతో మీ ప్రేమను తెలియజేయండి.
11/ 12
కుంభ రాశి: వీరికి ఎలెక్ట్రిక్ బ్లూ, టర్కోయిస్ కలర్స్ బాగా సూట్ అవుతాయి. ఈ రంగులు సూచించే విశాలత్వం వీరికి జీవితంలో ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుంది. అందుకే బ్లూ కలర్ ఫ్లవర్‌తో మీ ప్రేమను వ్యక్తపరచండి.
12/ 12
మీనరాశి: ఈ రాశి వారికి పసుపు రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ కూడా వారికి శుభప్రదం. వీలైతే పసుపు రంగు పువ్వుతో మీ ప్రేమను తెలియజేయండి.