Astrology Today : మనుషుల జీవన స్థితిగతులు గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా మారుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. వాటి ఆధారంగా మనిషి రోజు వారి జీవితంలో ఎదురయ్యే అదృష్ట, దురదృష్టాలను అంచనా వేస్తుంటారు. జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం నాడు ఏయే రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం (Aries) : కొన్ని గందరగోళాల మధ్యే ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి రావచ్చు. రోజులన్నీ రొటీన్‌గా సాగిపోతున్నట్లు భావిస్తే.. కాస్త ఉత్సాహ వాతావరణం రాబోతుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో కొంత ప్రగతి కనిపిస్తుంది. పెట్ థెరపీ (pet therapy) కోసం కొంతమంది పెంపుడు జంతువులను తెచ్చుకోవాలని చూస్తారు. ఆత్మీయులతో సన్నిహితంగా ఉండటం ద్వారా ఆందోళనను దూరం చేసుకోవచ్చు. లక్కీ సైన్ - ఓపెన్ గేట్
సింహం (Leo) : రాబోయే రోజుల్లో జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలవుతుంది. మీ దూకుడు స్వభావం మీ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు. మీ చుట్టుపక్కల వాళ్లు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని ఆత్మీయుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. లక్కీ సైన్ - స్వీట్ బాక్స్
వృశ్చికం (Scorpio) : మంచి వ్యక్తులను కలవడం ద్వారా కొన్ని శుభ పరిణామాలు జరుగుతాయి. పనిలో మీరు చూపించే నిజాయతీ మీ వృద్ధికి సహాయపడుతుంది. మీ దగ్గర సిబ్బంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండవచ్చు. కొత్త గాడ్జెట్స్ కొనడానికి షాపింగ్ చేస్తారు. ఆస్తిని కొనాలనే ఆలోచనలో ఉంటారు. అందుకు ఇదే తగిన సమయం. లక్కీ సైన్ - చెక్క పెట్టె.
ధనస్సు (Sagittarius) : అదృష్ట కాలం. స్నేహితులతో కలిసి షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. తోటపని మంచి అలవాటు. దీంతో మీరు కొత్త బిజినెస్ ఐడియాలు చేస్తారు. మీరు చేస్తున్న పనిలో మంచి ఫలితాలు రాబట్టేందుకు కొన్ని మార్పులు చేస్తే మంచిది. విశ్రాంతి కోసం వేరే ప్రాంతానికి వెళ్తారు. లక్కీ సైన్ - గులాబీ పువ్వులు.
వాహనం కొనే ఆలోచన చేస్తారు. లక్కీ సైన్ - నాణెం." width="1600" height="1600" /> మకరం (Capricorn) : ఇది చాలా మంచి సమయం. మీ సామర్థ్యాన్ని సరైన విధానంలో ఉపయోగించడం ద్వారా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కాలం కూడా కలిసి వస్తుంది. కుటుంబ సమేతంగా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లే అవకాశం ఉంది. అందరి ముందూ మీ బంధువులనూ, ఆత్మీయులనూ విమర్శించొద్దు. కొత్త వాహనం కొనే ఆలోచన చేస్తారు.
లక్కీ సైన్ - నాణెం.
మీనం (Pisces) : వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొత్త పనులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ కష్టానికి తగ్గట్లు ఆశించిన మేర ఫలితాలు పొందలేరు. ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ప్రయాణాలు చేయండి. ఆన్లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉండటం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. లక్కీ సైన్ - టాన్జేరిన్ ప్లేట్లు