Astrology Today: నేటి రాశిఫలాలు. ఓ రాశివారికి చెందినవారు ఇంతకుముందు పక్కనపెట్టిన ఆఫర్‌ను ఇప్పుడు తిరిగి స్వీకరించాలని అనుకుంటారు. కొందరు ప్లాన్ చేస్తున్న ట్రిప్‌లు విజయవంతం అవుతాయి. మరి కొందరు సొంత సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 6న ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (Aries): మీరు ఇప్పుడు కొంత కాలంగా డైలమాతో పోరాడుతూ ఉండవచ్చు. సమాధానం మీకు చాలా దగ్గరగా, రోజువారీ జీవితంలోనే ఉంటుంది. ఉద్యోగం లేదా ఏదైనా రోల్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. అనవసరమైన విషయాలకు అవకాశం కల్పించవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని కోసం ఒక మహిళ మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీరు ఇంతకు ముందు పక్కనపెట్టిన లేదా విస్మరించిన ఆఫర్‌ను తిరిగి తీసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. లక్కీ సైన్- ముత్యం. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం(Taurus): మీ ముందుకు వస్తున్న ఆర్థిక సంక్షోభంపై మీరు ఇప్పుడు శ్రద్ధ చూపకపోతే, త్వరలోనే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఒక కొత్త వ్యక్తి మీ దృష్టిని ఆకర్షించవచ్చు, ఒక యాదృచ్ఛిక గెట్ టుగెదర్‌కు దారి చూపవచ్చు. మీలో కొందరు ట్రిప్ ప్లాన్ చేసి ఉండవచ్చు కానీ అది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కష్టమైన పనులను నిర్వహించడానికి మీరు సరళమైన విధానాన్ని ప్రయత్నించవచ్చు. లక్కీ సైన్- బ్లూ రిబ్బన్. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (Gemini): మీ జీవితంలో గతంలో జరిగిన అంశాలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీ సొంత సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. సింపుల్ టాస్క్‌లు మొదట్లో కష్టంగా అనిపించవచ్చు కానీ విభిన్నంగా ఆలోచించేందుకు మీ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. కొత్త ఆసక్తి మిమ్మల్ని రాబోయే చాలా రోజులు బిజీగా ఉంచవచ్చు. మీకు అవసరమైనప్పుడు బంధువు నుంచి ఓదార్పు లభిస్తుంది. లక్కీ సైన్- బ్రైట్ లాంజర్ (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): మీరు వెంటనే అవసరమైన చర్య తీసుకోకపోతే మీ జీవితంలో సంక్షోభం రావచ్చు. కొంతకాలంగా ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి. కొత్త కమ్యూనికేషన్ మోడ్లు మొదట్లో మిమ్మల్ని ఉత్తేజపరచవచ్చు. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే, చాలా అవసరమైన బజ్‌ని సృష్టించవచ్చు. రచయితలు, పాత్రికేయులకు గుర్తింపు లభిస్తుంది, ప్రశంసలు అందుకుంటారు. టెక్నాలజీ సపోర్ట్ మీ రోజును సేవ్ చేస్తుంది. లక్కీ సైన్- కార్నెలియన్ (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (Leo): మీరు ప్రస్తుతం మానసికంగా చాలా బలహీనంగా ఉండవచ్చు. వ్యక్తిగత నష్టం జరిగి ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఉత్తమంగా ఓదార్చగలిగే వ్యక్తి కావచ్చు. మీరు మీ రూల్ బుక్‌ను అనుసరించడం కొనసాగిస్తే, మీ వేగం తగ్గిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి విడిపోవడం ముఖ్యం. మీకు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తి అయినప్పటికీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయవచ్చు. లక్కీ సైన్- గోల్డ్ ఛైన్ ( ప్రతీకాత్మక చిత్రం)
కన్య (Virgo): అహం హానికరం, మీరు దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీరు టీమ్ ప్లేయర్ కాకపోతే, కొంచెం అనుకూలంగా మారకపోతే పని కష్టంగా అనిపిస్తుంది. కొత్త ప్రణాళికలు టేకాఫ్ అవుతాయి, విషయాలు మరింత నమ్మదగినవిగా కనిపిస్తాయి. సంక్షోభం ఏదైనా ఉంటే సన్నిహితుల సహాయంతో ఎదుర్కొంటారు. మీ రిలేషన్ షిప్ ఇన్వెస్ట్ మెంట్స్ అన్నీ తెలివిగా చేయాలి లక్కీ సైన్- సెలబ్రిటీ (ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): ఇది గరిష్ట లాభాలు, సహాయాలు, రాబడిని పొందే కాలం. ఇది అసాధారణమైనదిగా మీకు అనిపించవచ్చు, కానీ శక్తి సంపదను సూచిస్తోంది. వ్యక్తులతో కొత్త రిలేషన్ ఏర్పరచుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ పాత పరిచయాలు చాలా సహాయరంగా ఉండవచ్చు. మీరు ఎవరితోనైనా మంచిగా ఉండలేకపోతుంటే.. పూర్తిగా విస్మరించవచ్చు. లక్కీ సైన్- గ్లాస్ బాటిల్ (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (Scorpio): మీ ప్రైమరీ కనెక్షన్ పూర్తిగా మీ సపోర్ట్‌గా ఉండకపోవచ్చు. మీపై విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా, ప్రస్తుతానికి ఉద్దేశాలను దాచి ఉంచవచ్చు. ఒక నిర్దిష్ట సంఘటన తర్వాత మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటే, దాన్ని తిరిగి పొందడానికి మీరు చాలా కష్టపడవచ్చు. మీరు చాలా కాలం నుంచి కోరుకుంటున్న ఒక ప్రత్యేకమైన అనుభవం పొందవచ్చు. ఇతరులను సర్ప్రైజ్ చేసే ప్రయత్నంలో మీరే సర్ప్రైజ్ అవుతారు. లక్కీ సైన్- అవెంచురిన్ (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (Sagittarius): ఇది మోటివేషన్ కావచ్చు, కానీ చివరికి ఇది మీలో సరికొత్త రొటీన్, సెల్ఫ్ కంట్రోల్ణు తీసుకురాబోతోంది. ఇది చిన్న లేదా పెద్ద స్వీయ-పరివర్తనకు సమయం. రొమాంటిక్ ఇంట్రెస్ట్‌ను కనుగొనే అవకాశం ఎక్కువగా ఉంది. అతను లేదా ఆమె గురించి కొంత కాలం పగటి కలలు కంటారు. మీరు స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. అది సాధ్యమవుతుంది. లక్కీ సైన్- నియాన్ లైట్ (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (Capricorn): ఇది మొదట్లో క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది. మీరు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నందున బయటి వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేయవచ్చు. మీరు దీన్ని త్వరలో అధిగమిస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడిన కొత్త ప్రణాళిక అమలులోకి రావచ్చు. మీరు విద్యావేత్త అయితే, మీరు ఎదురుచూస్తున్న విజయాన్ని ఆశించవచ్చు. తర్వాత పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు కొత్త ఆలోచనకు బీజం పడవచ్చు లక్కీ సైన్- గ్రీన్ క్యాండిల్ (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (Aquarius): కొంతమంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలతో మీరు ఎక్కువ సమయం కేటాయిస్తారు. పని వద్ద కొత్త విధానం అడ్జస్ట్మెంట్లను కోరవచ్చు. ఒక సహోద్యోగి మీ ఎదుగుదలను చూసి అసూయ పడవచ్చు. కొత్త ఆలోచనలు, వాటి అమలు కూడా ఊపందుకుంటుంది. కొత్త వ్యాపారానికి సంబంధించిన ఆఫర్ కూడా మీకు రావచ్చు. కొందరు విరామం తీసుకోవడం అవసరమని మీరు భావించవచ్చు. లక్కీ సైన్- ఫిష్ ట్యాంక్ (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (Pisces): సహోద్యోగితో ఒక సమస్య ఉండవచ్చు, అది వాగ్వాదానికి దారితీయవచ్చు. మీరు ఇప్పుడు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకపోవచ్చు, ఎందుకంటే ఇది తీవ్రమవుతుంది. అంతర్జాతీయంగా చదువుకోవడానికి లేదా పని చేయడానికి మీకు అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు వైద్య సహాయం అవసరం కావచ్చు. మీరు కొద్దిగా మానసిక కల్లోలం అనుభవించవచ్చు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. లక్కీ సైన్- రెడ్ డాట్ (ప్రతీకాత్మక చిత్రం)