Rasi Phalalu : నేటి రాశిఫలాలు.. వీరికి కోర్టు కేసులు పరిష్కారమయ్యే ఛాన్స్
Rasi Phalalu : నేటి రాశిఫలాలు.. వీరికి కోర్టు కేసులు పరిష్కారమయ్యే ఛాన్స్
Rasi Phalalu : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మార్చి 31 శుక్రవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.
Astrology Today : జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశిఫలాలు చెబుతుంటారు. అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని మార్చి 31, శుక్రవారం నాటి రాశిఫలాలను అంచనా వేశారు. జ్యోతిష్యం ప్రకారం, ఈరోజు ఎవరికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి.
2/ 14
మేషం (Aries) : ఒక కొత్త వెల్నెస్ ఎక్స్పీరియన్స్ ఆకర్షణీయంగా అనిపించవచ్చు. మీరు గత కొన్ని రోజులుగా చేస్తున్న అన్ని ప్రణాళికలూ ఇప్పుడు ఫలితాలు ఇవ్వవచ్చు. మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూస్తున్న వారికి అర్హత గల అవకాశం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ సైన్- టర్కోయిస్ దుస్తులు
3/ 14
వృషభం (Taurus) : విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నందున మీరు మీ ఊహ నుంచి బయట పడటానికి సిద్ధంగా ఉన్నారు. ముందున్న సవాలు కష్టంగా అనిపించినా అది అసాధ్యం కాదు. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులో, కొంత భాగాన్ని వారు తిరిగి ఇవ్వవచ్చు. లక్కీ సైన్- కూల్‌డ్రింక్
4/ 14
మిథునం (Gemini) : అసలు ప్లాన్ మీరు ఊహించిన దానికంటే భిన్నమైన ఫలితాలను చూపవచ్చు. మీ సంభాషణతో మీరు ఎవరినైనా బాధ పెడితే, మీరు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి. ఇది ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి అనుకూల సమయం కావచ్చు. లక్కీ సైన్- రూబి స్టోన్
5/ 14
కర్కాటకం (Cancer) : మీరు ఇష్టమైనది కష్టపడి పట్టుదలతో నేర్చుకున్నారు. మీరు మోసుకెళ్తున్న నిరుత్సాహం తొలగిపోనుంది. పని కోసం కొత్త అవకాశం త్వరలో మీ తలుపు తడుతుంది. లక్కీ సైన్- బంతి పువ్వు
6/ 14
సింహం (Leo) : మితిమీరి ప్రాక్టికల్‌గా ఉండటం, కొన్నిసార్లు మీ వ్యక్తిత్వంలోని చెత్తను బయటకు తీసుకురావచ్చు. చట్టపరమైన విషయం కొంత అనుకూలమైన కదలికను చూపుతుంది. కొత్త ఒప్పందాలను చేసుకుంటున్న, పేపర్లపై సంతకం చేయడానికి ప్రయత్నిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలి. లక్కీ సైన్- మెరిసే బ్రాస్లెట్
7/ 14
కన్య (Virgo) : మిమ్మల్ని మీరు ప్రదర్శించే విధంగా అర్థం చేసుకోకపోవచ్చు. సానుకూల ప్రభావం మీ ఆలోచనా విధానాన్ని, అలవాటును మార్చవచ్చు. ఏదైనా వైద్య సమస్యలను నివారించడానికి, మీరు ముందుగా మీ గురించి తెలుసుకోవాలి. లక్కీ సైన్- వాటర్ బాటిల్
8/ 14
తుల (Libra) : సన్నిహితంగా ఉండే వ్యక్తితో మీ రిలేషన్ సరిదిద్దుకోవాలి. కొంత మిస్‌కమ్యూనికేషన్ సంక్లిష్టతకు దారితీయవచ్చు. టాక్సిక్ పీపుల్ (విషపూరిత)కు దూరంగా ఉండటం మంచిది. లక్కీ సైన్- గ్రీన్ స్టోన్
9/ 14
వృశ్చికం (Scorpio) : బయటి వ్యక్తి జోక్యం వల్ల మీ సమయం వృథా కావచ్చు. కొత్త పార్ట్నర్షిప్ కొలాబరేషన్ జరిగే సూచనలు ఉన్నాయి. మీరు అంతర్జాతీయంగా మీ పనిని విస్తరించాలని ప్లాన్ చేసుకోవచ్చు. లక్కీ సైన్- ఉడుత
10/ 14
ధనస్సు (Sagittarius) : ఎవరైనా చాలా కాలం నుంచి మీ పట్ల తమ భావాలను వ్యక్తపరచాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు, మీరు తప్పనిసరిగా సంజ్ఞ (సంకేతం)ను అభినందించాలి. కొన్ని పన్నుకు సంబంధించిన విషయాలు ఎటువంటి కారణం లేకుండా నిలిచిపోవచ్చు. లక్కీ సైన్- ఎల్లో సెఫైర్
11/ 14
మకరం (Capricorn) : వేరొకరి కన్వర్జేషన్ ద్వారా ప్రభావితం కాకుండా ఉండటానికి ప్రయత్నించండి, దానిపై అవగాహన పెంచుకోండి. మీరు కొత్త లేదా స్టార్టప్ వ్యాపారంలో ఉంటే, మీరు లెక్కించని కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ధ్యానం చేయండి. లక్కీ సైన్- ఎండమావి
12/ 14
కుంభం (Aquarius) : చెత్త విషయాలు ఇప్పుడు ముగిసిపోవచ్చు. మీరు కొత్త జీవితం, కొత్త సాహసం, మీ ఆత్మను సంతోషపెట్టే వాటి వైపుకు వెళ్ళవచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. మిగతావన్నీ చాలా చక్కగా అలైన్డ్గా ఉన్నాయి. లక్కీ సైన్- నీరు మంచు మిశ్రమం(Slush)
13/ 14
మీనం (Pisces) : మీరు చాలా కాలంగా వర్క్ చేస్తున్న దానికి ఎట్టకేలకు గుర్తింపు లభించవచ్చు. ఆఫీస్‌లో స్వల్ప వాదనలు ఉండవచ్చు. ఇంట్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విషయం కూడా మరోసారి తలెత్తవచ్చు. లక్కీ సైన్- ఇత్తడి విగ్రహం
14/ 14
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.