Rasi Phalalu : నేటి రాశిఫలాలు.. వీరు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి
Rasi Phalalu : నేటి రాశిఫలాలు.. వీరు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి
Rasi Phalalu : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మార్చి 30 గురువారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.
Astrology Today : జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశిఫలాలు చెబుతుంటారు. అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని మార్చి 30, గురువారం నాటి రాశిఫలాలను అంచనా వేశారు. జ్యోతిష్యం ప్రకారం, ఈరోజు ఎవరికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి.
2/ 14
మేషం (Aries) : పెండింగ్‌లో ఉన్న వర్క్‌ను కొనసాగించడానికి, గతానికి సంబంధించి ఏవైనా బకాయిలు ఉంటే వాటిపై దృష్టిసారించడానికి ఇవాళ అనువుగా ఉంటుంది. వాగ్వాదం జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. లక్కీసైన్ - తోట
3/ 14
వృషభం (Taurus) : ఈ రోజు ఎనర్జీలు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇది మిమ్మల్ని కొన్ని కొత్త పనులు లేదా ఆలోచనలను ప్రారంభించేలా చేస్తుంది. ఎవరైనా అప్పు అడిగితే, సున్నితంగా తిరస్కరించండి. చాలా ఎక్కువగా నడవడానికి ప్రయత్నించండి. ఇది మీకు థెరపీలాగా పనిచేస్తుంది. లక్కీసైన్ - రెండు ఈకలు
4/ 14
మిథునం (Gemini) : మీరు అంతరంగంగా బలంగా ఉన్నప్పటికీ ఇతరులు మీ భావోద్వేగాన్ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెన్స్ సాధించడానికి కొన్ని చర్చల వ్యూహాలు అవసరం. ఒక సహోద్యోగి ఆర్థిక సహాయం కోసం అడగవచ్చు. అది నిజమైనది కావచ్చు. లక్కీసైన్ - గులకరాళ్లు
5/ 14
కర్కాటకం (Cancer) : పాత పరిచయస్తుడిని కలవడం లేదా తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఔట్‌డోర్ అపాయింట్మెంట్కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. మీరు ఒక కారణానికి మద్దతు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఇప్పుడు అందుకు అవకాశాన్ని చూడవచ్చు. లక్కీ సైన్ - హ్యాండ్ మేడ్ పేపర్
6/ 14
సింహం (Leo) : అతిథులు చెప్పాపెట్టకుండా రావచ్చు. ఈ రోజు స్వీట్ ట్రీట్ ఇచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన కొన్ని ఆర్థిక వ్యవహారాలు క్లియర్ కావచ్చు. మీ సహాయక సిబ్బంది ఫిర్యాదుతో రావచ్చు. ప్రాధాన్యాన్ని బట్టీ దాన్ని పరిష్కరించండి. లక్కీ సైన్ - ముత్యాలు
7/ 14
కన్య (Virgo) : పనిలో వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నందున పెండింగ్‌లో ఉన్న సుదీర్ఘ సంభాషణను ఎంచుకోవచ్చు. పేపర్ వర్క్ ఇంట్లో, ఆఫీస్‌లో కొనసాగించండి. మీకు నిద్ర కరవైంది. దీంతో ఈ రాత్రి కొంత నాణ్యమైన నిద్ర పొందేలా జాగ్రత్త వహించండి. లక్కీసైన్ - డోర్‌స్టెప్
8/ 14
తుల (Libra) : కేరింగ్ తీసుకోవడం అనేది మిమ్మల్ని ఏ విధంగానూ బలహీనపరచదు. కొంతమంది కీలకమైన వ్యక్తులు నిశితంగా గమనించవచ్చు. కాబట్టి మీకు సంబంధించిన బలమైన అంశాలతో ముందుకు సాగండి. మీ ఆరోగ్య పరిస్థితిపై అదనపు శ్రద్ధ తీసుకోండి. లక్కీసైన్ - రెడ్ స్క్రాప్
9/ 14
వృశ్చికం (Scorpio) : పీడకలలు అనేవి కేవలం సబ్కాన్షియస్మైండ్కు సంబంధించిన భయాలు. కాబట్టి వాటిని తీవ్రంగా పరిగణించవద్దు. అపోజిట్ సెక్స్ వర్గానికి చెందిన వ్యక్తి మీ దృష్టిని ఆకర్షించవచ్చు. పాత స్నేహితుడికి కాల్ చేయడం ద్వారా రోజును పరిగణలోకి తీసుకోండి. లక్కీసైన్ - ఇటుక గోడ
10/ 14
ధనస్సు (Sagittarius) : మీకు బాగా క్లోజ్‌గా ఉన్నవారిని మిస్ అవుతున్నారు. ఈరోజు మీకు ఇష్టమైనవారి కోసం సమయాన్ని కేటాయించండి. సాయంత్రం సమయంలో ట్రిప్ ఉండవచ్చు. రొటీన్ మెడికల్ చెకప్ కీలకం కానుంది. లక్కీసైన్ - నియాన్ గుర్తు
11/ 14
మకరం (Capricorn) : పాత జ్ఞాపకాలు రోజును శాసించే అవకాశం ఉంది. అయితే రియాలిటీ చెక్ మీకు సహాయకరంగా ఉండవచ్చు. మీ తల్లిదండ్రులను వాకబ్ చేయండి. వారు మీ దృష్టికి తీసుకురావాల్సిన విషయాలతో ఉండవచ్చు. పాత విధానం కోసం కొత్త ప్రణాళికను రూపొందించండి. లక్కీ సైన్ - గాజు సీసా
12/ 14
కుంభం (Aquarius) : మీ భయాలు ఇప్పుడు అదుపులో ఉంటాయి. ఇక చెడు కలలు రావు. కాలం మారింది. ఇటీవలి కాలంలో మీరు సాధించిన దానికి కృతజ్ఞతతో ఉంటారు. మీరు అదనపు బాధ్యతను పొందే అవకాశం ఉంది. లక్కీసైన్ - మర్రి చెట్టు
13/ 14
మీనం (Pisces) : మీ కుటుంబానికి మీరు భావోద్వేగ మద్దతు వ్యవస్థ లాంటివారు. దీంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ నిపుణులు చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు ఆటంకాలు ఎదుర్కొంటారు. లక్కీసైన్ - పక్షుల సముదాయం
14/ 14
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.