మేషం (Aries) : మీకు కొన్ని రోజుల కిందట వచ్చిన కొన్ని యాదృచ్ఛిక కాల్స్, పనులు మీకు సరిగ్గా పని చేయకపోవచ్చు. ఒక వ్యక్తి కారణంగా మరొకరు మీపై తప్పుడు భావన కలిగి ఉండవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించిన పాజిటివ్ న్యూస్, మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. కొంతకాలం కిందట వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్, మళ్లీ మీ దగ్గరికి రావచ్చు. మీ సమస్యలను త్వరలో పరిష్కరించుకోండి. లక్కీ సైన్ - పడవ
వృషభం (Taurus) : పనిలో ఉన్న సమస్యలకు సీనియర్ గైడెన్స్ ప్రాక్టికల్‌గా, ఉపయోగకరంగా ఉండవచ్చు. మీ అవసరాలకు సహకరించే, సున్నితంగా ఉండే మంచి వ్యక్తులతో కలిసి పని చేయడం వల్ల మీరు అదృష్టవంతులు కావచ్చు. రిలేషన్షిప్లో ఉన్నవారు తాత్కాలికంగా గందరగోళానికి గురికావచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే, కేవలం ఆసక్తిని మాత్రమే కాకుండా సరైన గైడెన్స్ కూడా తీసుకోండి. లక్కీ సైన్ - వర్షం చుక్క.
మిథునం (Gemini) : కొంత కాలం కిందట వరకు పెద్దదిగా అనిపించినదాన్ని సులభంగా సాధిస్తారు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక వ్యాపారవేత్త ఒక స్పెషల్ ఆఫర్‌తో మిమ్మల్ని సంప్రదించవచ్చు. డౌట్స్ పెట్టుకోవడం మీ పని వేగాన్ని నాశనం చేస్తుంది. సోలో ట్రిప్ ప్లాన్ ఉండవచ్చు, అది కూడా బడ్జెట్లో ఉండవచ్చు. ప్రాజెక్ట్ ఐడియా ఎగ్జైటింగ్‌గా అనిపించవచ్చు. లక్కీ సైన్ - తాజా పెయింట్
కర్కాటకం (Cancer) : మీరు ఇంతకుముందు పనిచేసినంత ఉత్సాహంతో పని చేయకపోవచ్చు. ప్రస్తుతానికి ఇన్నర్ రిఫ్లెక్షన్ రొటీన్ అవసరం కావచ్చు. కుటుంబంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఇప్పుడు అసంభవం. మీరు గతంలో చేసిన కొన్ని పనులు మిమ్మల్ని మళ్లీ వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. రీఫ్రెష్ అవ్వడం కోసం విహారయాత్రలకు వెళ్లడం మంచిది. లక్కీ సైన్ - క్రిస్టల్ థెరపీ
సింహం (Leo) : మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి కలలు కంటుంటే, దీనికి పునాది వేయడానికి, పనిని ఇప్పుడే ప్రారంభించాలి. చాలా మంది శ్రేయోభిలాషులు మీకు సహకరించడానికి రావచ్చు. మంచి ప్రారంభం దక్కితే, సగం విజయం సాధించినట్లే. కుటుంబంలో కలహాలు చాలా మంది మనసులో అశాంతికి కారణం కావచ్చు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాన్ని ఆశించవచ్చు. ఒక షాపింగ్ ప్లాన్ మీకు అవసరమైన ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. లక్కీ సైన్ - ఒక సిట్కామ్
కన్య (Virgo) : తెలివికి బదులుగా యాక్షన్ ఓరియెంటెడ్ ప్లాన్ అవసరం కావచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, దాని కోసం వేట ఇప్పుడు ప్రారంభించాలి. మీరు మరింత మంది వ్యక్తులతో నెట్వర్కింగ్ చేసుకోవాల్సి రావచ్చు. పాత సహోద్యోగి మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. కుటుంబం మద్దతు కొనసాగుతోంది. మీ ఆలోచనలకు రెక్కలు రావాలంటే, బయటి వ్యక్తులతో ఎక్కువ వివరాలను పంచుకోవద్దు. అనవసరమైన దూకుడును కంట్రోల్ చేసుకోవాలి. లక్కీ సైన్ - హిస్టారిక్ పెయింటింగ్.
తుల (Libra) : పనితో ఎమోషన్స్ మిక్స్ చేయకూడదు. ప్రత్యేకించి మీ పనితీరును నిశితంగా చూసే వ్యక్తులు ఉన్నప్పుడు ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఇంతకు ముందు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం అలా భావించడం లేదు. స్నేహితులను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని ముందుకు సాగాలి. మీ వర్క్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి మీకు అవకాశం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇతరులను మీరు విస్మరిస్తున్నారని వారు భావించవచ్చు. లక్కీ సైన్ - చెంచా
వృశ్చికం (Scorpio) : మీరు ఒక ముఖ్యమైన విషయంపై గతంలో తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ పరిస్థితులు దానికి మద్దతు ఇవ్వకపోవచ్చు. మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నది ప్రస్తుతానికి ఆపేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇప్పుడు తీసుకున్న యాదృచ్ఛిక నిర్ణయాలు మిమ్మల్ని తర్వాత పశ్చాత్తాపపడేలా చేస్తాయి. మీరు చాలా కాలం నుంచి పని చేస్తున్న ఒక ప్రాజెక్ట్, తుది రూపుకు చేరుకుంటోంది. రోజూ మెడిటేషన్ చేస్తే మీ మానసిక సమస్యలు తొలగిపోతాయి. లక్కీ సైన్ - బాటిల్ ఓపెనర్.
ధనస్సు (Sagittarius) : చివరకు మీకు రిలీఫ్‌గా అనిపిస్తుంది. గందరగోళంగా ఉన్న చాలా విషయాలు కలిసి రావడం ప్రారంభించవచ్చు. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి, గతంలో బ్రేక్ అయిన రిలేషన్స్‌లో కూడా పాజిటివ్ మూమెంట్ ఉంటుంది. ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ గ్యాప్ క్లియర్ అవుతుంది. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకోవచ్చు, వారు రాబోయే కాలంలో చాలా ఉపయోగకరంగా మారవచ్చు. మీ అభిప్రాయాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి సంకోచించకండి. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి ఆహ్వానం అందుకోవచ్చు. లక్కీ సైన్ - సీతాకోకచిలుక
మకరం (Capricorn) : మీ నిజాయితీ, సిన్సియారిటీతో చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరచడం మీ వంతు. ఎటువంటి కారణం లేకపోయినా, వ్యక్తులతో మాట్లాడటం మంచిది. మీ ఫ్రెండ్లీ ఆట్టిట్యూడ్ మీకు మేలు చేయవచ్చు. కానీ ఇది అతిగా ఉండకూడదు, ఎందుకంటే ఇది టైమ్ సెన్స్‌ను దెబ్బతీసి, ఆలస్యానికి దారితీయవచ్చు. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు మీ పిలుపు కోసం వేచి ఉండవచ్చు. మీరు వంట చేస్తూ టైమ్ స్పెండ్ చేయవచ్చు, అయితే ఇది బలవంతం వల్ల కావచ్చు. లక్కీ సైన్ - కొవ్వొత్తి స్టాండ్.
కుంభం (Aquarius) : సోషలైజింగ్ అనేది మీకు అవసరంగా భావిస్తే, దాన్ని పరిమితం చేయాల్సిన సమయం వచ్చింది. మీ ప్రస్తుత స్థానాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉండవచ్చు, కానీ మీ పనిపై ప్రభావం పడుతోంది. మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ఇది మీ CVని కూడా అప్‌గ్రేడ్ చేస్తుంది. ఒక జూనియర్‌కు మీ సమయం, సహకారం అవసరం కావచ్చు. మీకు రాయడం అంటే ఇష్టమైతే, వాటిని పబ్లిష్ చేయించడం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. క్రియేటివ్ స్కిల్స్ ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను పొందవచ్చు. ఆరోగ్య పరంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. లక్కీ సైన్ - ప్రశాంతమైన సంగీతం.
మీనం (Pisces) : మీరు ఇప్పటికి చాలా టెక్నిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించి ఉండవచ్చు, కానీ దానికి యాక్సెసిబిలిటీ సపోర్ట్ ఉండాలి. కొన్నిసార్లు మీరు ఒకరి ఎమోషన్స్ దెబ్బతీస్తారు. ఈ రోజు మిమ్మల్ని మీరుగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ ఇన్నర్ రిఫ్లెక్షన్‌కు మెరుగులు అవసరం కావచ్చు. సంపదను కూడబెట్టుకోవడం, అలాంటి జీవనశైలిని గడపడం ద్వారా మీరు ప్రతిదీ సాధించకపోవచ్చు. జీవితంలో సామరస్యం కోసం మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. లక్కీ సైన్ - సింఫొనీ.