మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆవేకావేషాలకు దూరంగా ఉండాలి.
వృషభం (కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2) : ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగపరంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తి డి ఉంటుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3) : ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, కొన్ని అనవసర ఖర్చులు తప్పవు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేషు) : ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పట్టుదలతో అనకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఒకరి ఆనారోగ్యం ఆందోళన కలిగిస్తుం ది. వృత్తి, వ్యాపారాలవారు అభివృద్ధి సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. . ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారడానికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృ త్తి, వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది..
కన్య (ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2) : ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర ప్రాంతంలో చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.
తుల(చిత్త3, 4, స్వాతి, విశాఖ 1,2,3) : ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకు వచ్చి బాధపడతారు. వైద్యం మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠు) : ఉద్యోగంలో అధికారులు, సహెూద్యోగుల సహకారం ఉంటుంది. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబానికి సంబంధించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే ఆవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరు గుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిపి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా బాగుంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి..
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1, 2) : ఉద్యోగం అనుప్తంగా ఉంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఆరోగ్యం జాగ్రత్త, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3) : ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు, ఒక కుటుంబ సమస్య కొద్దిగా చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త, అనవసర విషయాల్లో తల దూర్చవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీ ఉండవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతానం పురోగతి సాధిస్తారు.