మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) :మీరు ఈ రోజు ఒకే సమయంలో చాలా పనులు చేయాల్సి ఉండొచ్చు. ఆఫీసులో పనులు వరకు ప్రశాంతంగానే ఉంటాయి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సంకేతాలు కొంచెం కనబడినా వెంటనే వైద్యం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఏ కొద్ది తేడా కనబడినా వెంటనే అప్రమత్తం కావాలి. లక్కీ సైన్ - బంగారు చేప (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : మీ దగ్గరి వారే మీకు అడ్డంకిగా మారొచ్చు. మీకు వచ్చిన అవకాశం చేజారిపోవచ్చు. అయినా అధైర్య పడకుండా ముందుకు సాగాలి. అవకాశం మీ కోసం మళ్లీ దానంతట అదే వస్తుంది. మీ గురించి మీరు బహిరంగంగా ఏది బయటకు చెప్పకుండా ఉండటం మంచిది. లక్కీ సైన్ - ఈత (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : కొత్తగా ఏది చేయకూడదు. ప్రతీ రోజు చేసే పనిని చేస్తే చాలు. ఇతరుల మాటలు విని ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఇతరుల మాటలు పట్టించుకోకూడదు. ఈ రోజు మీకు తోచిన విధంగా పనులు చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీకు క్లిష్టమనిపించిన విషయాలన్నీ సులభతరంగా మారిపోతాయి. లక్కీ సైన్ - కోయిల (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్రేష) : ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు వచ్చే ధనానికి తాత్కాలికంగా అడ్డంకులు వస్తాయి. ఇక పని ప్రదేశంలో మార్పులు జరగొచ్చు. ఉద్యోగం చేసే ప్రదేశంలో ఊహించని విధంగా మార్పులు జరుగుతాయి. అంత మాత్రం చేత ఆందోళన చెందకుండా ముందుకు సాగాలి. లక్కీ సైన్- ఉద్యానవనం (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మీరు ఈ రోజు మీ ప్రతీ విషయాన్ని భాగస్వామితో పంచుకుంటే మంచిది. తద్వారా మీకు ఏర్పడే అనిశ్చితి తొలగిపోతుంది. మీరు దూరంగా ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంది. అందుకు మీరు మౌనంగా ఉండటమే కారణం అవుతుంది. మీకు ఈ రోజు సమయం దొరుకుతుంది. అప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం మంచిది. లక్కీ సైన్ - పక్షి గూడు (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఈ రోజు మీకు ఉద్యోగం లభించొచ్చు. అయితే, ఆ జాబ్ వచ్చినట్లే వచ్చి వాయిదా పడొచ్చు. ఈ రోజు మీరు అందరితో కలిసి బయటకు వెళ్లి సంతోషంగా గడపడం మంచిది. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించడం ద్వారా ఉద్యోగ అవకాశం లభిస్తుంది. లక్కీ సైన్ - రెండు పిచ్చుకలు (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈ రోజు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు గడవడం చాలా కష్టంగా ఉండొచ్చు. మీరు అనుకునే అద్భుతమైన మీ నుంచి బయటకు వెళ్లొచ్చు. అయితే, అందుకు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మరో సరి కొత్త ఆలోచన మీకు వచ్చి అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. లక్కీ సైన్ - చెక్క పెట్టె (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : మీ అభివృద్ధికి సంకేతాలు కనబడుతాయి. మీరు అనుకుని మరిచిపోయిన పని ఈ రోజు విజయం దిశగా వెళ్తుంది. ఆ విజయం చూసి మీరు ఆనందపడొచ్చు. ఇక మీరు తాత్కాలిక పెట్టుబడులపైన కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులపైన దృష్టి సారిస్తే మంచిది. అలా చేయడం ద్వారా మీకు లాభమే జరుగుతుంది. లక్కీ సైన్ - కొత్త ఫోన్ (ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : మీకు తోడబుట్టిన వారు మీకు తెలియని విషయాలు ఈ రోజు మీతో పంచుకుంటారు. మీరు పెట్టిన అతి తక్కువ పెట్టుబడికి ఈ రోజు చక్కటి లాభాలు వస్తాయి. అయితే, మీకు ఈ రోజు నష్టం జరిగే ఘటన కూడా జరగొచ్చు. మీ బంధువుల్లో ఒకరు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయొచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. లక్కీ సైన్ - ట్రంక్ (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): మీకు ఈ రోజు ఎంతటి పెద్ద ఆందోళన, అనిశ్చితి ఎదురైనా భయపడొద్దు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దూరపు ప్రయాణాలు చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. మీకు ఏదైనా విషయమై సూచనలు తీసుకోవాలని అనిపిస్తుంది. అయినా ప్రశాంతంగా ఉండాలి. లక్కీ సైన్ - సిరామిక్ కూజా (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): మిమ్మల్ని అమితంగా ఇష్టపడే కొత్త స్నేహితుడు మీ జీవితంలోకి వస్తాడు. ఈ రోజు మీ ఆలోచనలు మీరున్న వాతావరణానికి తగ్గట్లుగా ఉంటాయి. మీ గురించి ఎవరు ఏ అభిప్రాయం ఏర్పరుచుకున్నారో అదే విధంగా మీరు వారిపైన ప్రతి స్పందించరాదు. మీరు అనుకున్నట్లు కాకుండా వేరే దారిలో ముందుకు వెళ్తే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. లక్కీ సైన్ - నీలి రంగు బాటిల్ (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4): సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. సమస్య పట్ల విశాల దృక్పథంతో స్పందించాల్సి ఉంటుంది. ఒకే ఆదాయ వనరుపైన ఆధారపడరాదు. ఒక ఆలోచనలో పడిపోయి మీరు అందులోనే ఉండొచ్చు. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి జాగ్రత్తగా అడుగులు వేయాలి. లక్కీ సైన్ - వెండి చెంచా (ప్రతీకాత్మక చిత్రం)