మరోవైపు బుధుడికి మేధస్సు, తర్కం, సంభాషణ, గణితం, తెలివి, స్నేహ కారక గ్రహంగా పేరుంది. జూన్ 27న కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం జూలై 2న బుధుడు మిథునరాశిలో సంచరిస్తారు. కుజుడు, బుధుడు వారి స్వంత రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందడం ఖాయంగా కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (Aries): ఉద్యోగంలో పని పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. తల్లి నుంచి ధనలాభం కలుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విద్యారంగానికి చెందిన వారికి విజయం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీరు చేసే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (Scorpio): మానసిక ప్రశాంతత, సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల సహకారం లభిస్తుంది. దుస్తులు మొదలైన వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (Sagittarius): మీ పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సమయం గడపండి.(ప్రతీకాత్మక చిత్రం)