ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను మార్చి 30 న జరుపుకోనున్నాం.. రామనవమి పూజకు ఉత్తమ పూజా ముహూర్తం మధ్యం ఉంది. నవమి తిథి మార్చి 29, 2023 రాత్రి 09:07 గంటలకు ప్రారంభమై, 2023 మార్చి 30 రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది. శ్రీరామనవమి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి మధ్యకాలం అత్యంత పవిత్రమైన సమయమని పూజారులు చెబుతున్నారు.
ఆదర్శపురుషుడు ఏకపత్నివ్రతుడు శ్రీరాముడు. అందుకే శ్రీరామనవమి రోజు సరైన మార్గంలో పూజ చేసుకుంటే ఏడాది మొత్తం బాగా కలిసివస్తుంది. ఈరోజు సీతారామ కల్యాణం జరిపిస్తారు. రామాయణంలోని కొన్ని శ్లోకాలను చదవాలి. పుత్రకామెష్టి యాగం సంతానం లేనివారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనీసం ఆ ఘట్టం చదివించుకోవచ్చు. స్వామివారి కల్యాణాన్ని తిలకించాలి. అక్షితాలు శిరస్సు మీద వెసుకున్నా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
అలాగే రాములవారి చిత్ర పటానికి గంధం, బొట్టుకాటుక పెట్టి పూలు సమర్పించాలి. రామరక్షస్తోత్రం చదవాలి. రామనవమి రోజు కల్యాణ మంత్రాలు తప్పక వినాలి. ఈరోజు పానకాన్ని శ్రీరాముడికి నివేదన చేసి, దాన్ని ఇంట్లో అందరూ పుచ్చుకోవాలి.కల్యాణం సమయంలోని తలంబ్రాలు పోయడం వీక్షించినవారికి ఆహారానికి లోటు ఉండదని అంటారు. ఈరోజు రామనామం జపించాలి. రాములవారిని తులసిదళంతో, సీతమ్మతల్లిని మారేడు, హనుముంతుడిని తమలపాకులతో ఈరోజు పూజించాలి.ఆశేష లాభాలు కలుగుతాయి.
ముఖ్యంగా శ్రీరామనవమిరోజు వడపప్పు తయారు చేసి స్వామివారికి నివేదించాలి. రామాయణగాథ ఏదైనా చదువుకోవాలి. సీతారాములు ఆదర్శదంపతులు అందుకే ఈ ఒక్కరోజైనా భార్యభర్తలు పోట్లాడుకోకుండా ఉండాలి. కల్యాణ తలంబ్రాలు భద్రంగా దాచుకుంటారు. ఎవరైనా పెళ్లి సమయంలో తలంబ్రాల్లో సీతారాముల తలంబ్రాలు కొన్ని కలిపినా వారి దాంపత్యంలో ఏ లోటు ఉండదు. రాముడి ఆశీస్సులు ఉంటాయి.