దశరథ రాముడు, సకల కళా గుణాభిరాముడు అయిన శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో అంటే మిట్టమధ్యాహ్నాం త్రేతాయుగంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు శ్రీ మహా విష్ణువు అవతారం. (Image Credit www.hindugallery.com)
ఒకే బాణం, ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం. రామబాణానికి ఉన్న శక్తి అటువంటిది. ‘నవమి’ శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ నవమి రోజునే జరిగాయి. నవ అంటే తొమ్మిది. సాధారణంగా సామాన్యకలు నవమి అంటే భయపడతారు. కానీ శ్రీరాముడికి నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. శ్రీమహా విష్ణువు ఏడో అవతారంగా శ్రీరాముడిని భావిస్తారు. బిలాస్పూర్ ప్రసిద్ధ పండిట్ కృష్ణ కుమార్ ద్వివేది ప్రకారం, శ్రీరామ నవమి నాడు అనేక శుభకార్యాలు ఉన్నాయి. ఈ సారి శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైనదిగా భావించే సర్వార్థ సిద్ధి యోగంలో వస్తోంది. (Image Credit www.hindugallery.com)
రామనవమి పండుగను మార్చి 30 న జరుపుకోనున్నాం.. రామనవమి పూజకు ఉత్తమ పూజా ముహూర్తం మధ్యం ఉంది. నవమి తిథి మార్చి 29, 2023 రాత్రి 09:07 గంటలకు ప్రారంభమై, 2023 మార్చి 30 రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది. శ్రీరామనవమి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి మధ్యకాలం అత్యంత పవిత్రమైన సమయమని పూజారులు చెబుతున్నారు. (Image Credit www.hindugallery.com)
శ్రీరామ నవమి రోజున చేసిన వడపప్పు బెల్లంతో చేసిన పానం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ పండుగకు ఇవే ప్రత్యేకతమైనవి. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకమే శ్రీరామనవమి పండుగ ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీరామ నవమి వేడులకు తెలుగు రాష్ట్రాలు ముస్తాబు అవుతున్నాయి. హిందువులు శ్రీరామ వేడుకలు జరుపుకుని పానం తాగి జై శ్రీరామ్ నినాదాలు చేస్తారు. (Image Credit www.hindugallery.com)
రామాయణాలను ఎంతోమంది రాశారు. కానీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే బాగా ప్రసిద్ధి చెందిందిం. ఇంకా మొల్ల రామాయణం,తులసీ రామాయణం వంటివి ఎన్నో ఉన్నాయి. ఎంతమంది రాసినా శ్రీరాముడి గొప్పతనం గురించే..సీతమ్మ రామయ్యల గురించే..సీతారాములు, రామ లక్ష్మణులు ఇలా ఈ ముగ్గురి గురించే బాగా ప్రసిద్ధి చెందిన కథలు పురాణాల్లో ఉన్నాయి. (Image Credit www.hindugallery.com)